ఉపఎన్నికలకు వైకాపా భయపడుతోందా?

YSRCP fears about loksabha byelectionsలోక్ సభ స్పీకర్ వైకాపా ఎంపీల రాజీనామాలు ఆమోదించడంతో ఆ కథ మొత్తానికి సుఖాంతం అయ్యింది. అయితే తెలివిగా ఉపఎన్నికలు రాకుండా జాగ్రత్త పడ్డారు అనే నింద మాత్రం వారి మీద పడింది. దీనిని పోగొట్టుకోవడానికి ఉపఎన్నికలు వస్తే పోటీకి సిద్ధమని మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

ADVERTISEMENT

అయితే ఇది సమయంలో రెండు అర్ధాలు వచ్చేలా కూడా మాట్లాడుతున్నారు. ఉప ఎన్నికలు వస్తే పోటీ పెడతామని చెప్పి,ప్రత్యేక హోదాను మళ్లీ నీరు కార్చే యత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీని బట్టి ఒక వేళ అనుకోని పరిస్థితులలో ఉపఎన్నికలు వచ్చినా ఓటమి భయం వారికి ఉందని అనుకోవాలా?

ఈ ఐదు లోక్ సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తే నంద్యాల మాదిరిగా టీడీపీ గెలిస్తే తమకు భవిష్యత్తు లేదని వారు భయపడుతున్నారా? రాజీనామా చేసిన వారిలో మేకపాటి రాజమోమన్ రెడ్డి (నెల్లూరు) , వైవి సుబ్బారెడ్డి (ఒంగోలు), వరప్రసాద్ (తిరుపతి), మిదున్ రెడ్డి (రాజంపేట), అవినాశ్ రెడ్డిలు (కడప) ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories