అధికారంలో ఉన్న ఐదేళ్లు తమ మూర్కత్వంతో, పాలనారాహిత్యంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ నేతలందరూ ఒక్కొక్కరుగా విదేశాలకు ఎగిరిపోవడానికి ‘సిద్ధం’ అంటూ సన్నద్ధమయ్యారు. జగన్ అండ చూసుకుని, వైసీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని నారా భువనేశ్వరి పై రెచ్చిపోయిన వల్లభనేని వంశీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విదేశాలకు పారిపోయారు అనే వార్త ఇప్పటికి ప్రచారంలో ఉంది.
అలాగే మా పార్టీ కార్యకర్తలకు బీపీలు వస్తే మీ పార్టీ కార్యాలయాలను తగలబెడతారు తప్పేముంది అంటూ సమాజానికి నేరాలను నేర్పించిన జగన్, ఆ మాటలకూ కట్టుబడి దాడులకు తెగబడిన వైసీపీ నేత దేవినేని అవినాష్ గతంలో తానూ చేసిన పాపాల నుండి తప్పించుకోవడానికి కూటమి ప్రభుత్వానికి చిక్కకుండా పారిపోవడానికి దుబాయ్ ‘యాత్ర’కు సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా అవినాష్ యాత్రను ఏపీ పోలీసులు భగ్నం చేశారనుకోండి.
ఇక మాజీ పర్యాటక మంత్రి రోజా నగరి గడ్డ రోజా అడ్డా అంటూ తొడలు కొట్టిన రోజా నగరి ప్రజలు ఇచ్చిన చీత్కారాన్ని తట్టుకోలేక కొన్నాళ్ళు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో తలదాచుకున్నారు. అసలే పర్యాటక మంత్రిగా చేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఇక తమిళనాడు పర్యటన ముగించుకుని విదేశీ పర్యటనకు రంగం సిద్ధం చేసుకుని రహస్యంగా ఫ్లయిట్ ఎక్కారు రోజా. అయితే ఇక్కడ తప్పించుకుని సోషల్ మీడియాలో అడ్డంగా దొరికి ట్రోల్స్ కు గుయారయ్యారు మాజీ మంత్రి.
ఇక గుడివాడ రౌడీ కొడాలి నాని కూడా ఎలాగలగు మెల్లిగా ఈ ఐదేళ్లు విదేశాలకెళ్ళి ‘కళ్ళు ‘మూసుకోవడానికి ఉన్న అన్ని దారులు జల్లెడపడుతున్నారంటూ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గత ఐదేళ్లు నోరు మూసుకుంటే ఈ ఐదేళ్లు కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా నాని గారు.
జగన్ అక్రమ కేసులలోనే కాదు వైసీపీ లో కూడా నెంబర్ 2 గా ఉన్న విజయ సాయి రెడ్డి కూడా తన విదేశీ యాత్రకు కోర్ట్ అనుమతి కోరుతూ పిటిషన్ వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో విజయ సాయి రెడ్డికి శాంతి లేకుండా పోయినట్లు ఉంది. ఇక్కడ దొరకని శాంతి విదేశాలలో అయినా దొరుకుతుందేమో అన్న ఆశతో విజయ సాయి ఉన్నారా? లేక మరేమన్న ఇతర కారణాలున్నాయా అన్న సంగతి ప్రజలకు చెప్పక పోయిన సాయి కోర్ట్ చెప్పాల్సి ఉంటుంది.
ఇక వైసీపీ అధినేత ఈ గ్యాంగ్ లీడర్ వైస్ జగన్మోహన్ రెడ్డి కూడా విదేశీ యాత్రకు తనను కూడా అనుమతించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తానూ లండన్ వెళ్ళాలి అనుమతి కావాలి అంటూ దేశం విడిచి వెళ్ళడానికి కోర్ట్ మెట్లెక్కారు రెడ్డి గారు. కోర్ట్ కెళ్ళడంలో జగన్ మాస్టర్స్ పూర్తి చేస్తారేమో. ఇలా పార్టీ అధినేత నుంచి పార్టీలో ప్రముఖులుగా చెప్పుకునే ఒక్కో వైసీపీ నేత విదేశీ యాత్రలు అంటూ ఎగిరిపోవడానికి సిద్దమవడం వెనుక దాగిఉన్న మర్మమేమిటో.?
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పక్కనే ఉన్న హైద్రాబాద్ కు వెళ్లినా బాబు, పవన్ లను టూరిస్ట్ రాజకీయ వేత్తలుగా పరిగణించిన ఈ పెద్ద మనుషులు ఇప్పుడు వారు అధికారానికి దూరమైన మూడు నెలలోపే రాష్ట్రాన్ని విడిచి పెట్టి పారిపోవడానికి సిద్ధం అంటూ కథం తొక్కుతున్నారు అంటే గతం తాలూకా పాపాలు వెంటాడుతున్నాయా? లేక భవిష్యత్ తాలూకా భయాలు కళ్ళ ముందు సాక్ష్యాత్కరిస్తున్నాయా? అనేది తేల్చాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వం మీద ఉండనే విషయం ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి.




