చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్టుగా వైసీపీ నేతల తీరు మారిపోయింది. ఒక రోజు మేము తిరిగి అధికారంలోకి వస్తే జగన్ 2.0 చూపిస్తాం అంటున్నారు, మరోసారి రప్ప రప్ప నరుకుతాం అంటూ రెచ్చిపోతున్నారు, మరోమారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన టెండర్లను రద్దు చేస్తాం అంటూ హెచ్చరిస్తున్నారు,
ఇంకోసారి వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వ అధికారులను ఏడూ సముద్రాల అవతల ఉన్న వదిలి పెట్టం అంటూ బెదిరిస్తున్నారు. అలాగే రాజధాని విషయంలో కూడా ఇలానే వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖే రాజధాని అంటూ ఒకరు, లేదు లేదు 2024 ఎన్నికల ఫలితాల తరువాత ప్రజాభిప్రాయానికి కట్టుబడి అమరావతే రాజధాని అంటూ మరొకరు, మూడు రాజధాని మా సిద్ధాంతం అంటూ ఇంకొకరు ఇలా వారి వారి ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తూ పోతున్నారు.
దీనికి తోడు వైసీపీ ఆత్మ సాక్షి అమరావతి మీద నిత్యం విషం చిమ్మడం, అసత్య ప్రచారాలు చేయడం తో రాష్ట్ర రాజధానిగా అమరావతి పై వైసీపీ విధానం ఎలా ఉండబోతుంది అనే అంచనాకు ఏపీ ప్రజలు ఎప్పుడో వచ్చేసారు. అలాగే గత ఐదేళ్ల వైసీపీ పాలన కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్ష్యం గా కనిపిస్తుంది.
అయితే వైసీపీ మరోసారి ఏపీ ప్రజలను ఏమార్చడానికి సిద్దమయ్యినట్టు కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ కీలక నేత మాజీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ రెడ్డి రాజధాని పై వైసీపీ విధానాన్ని వివరించారు.
వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా వైస్ జగన్ ఎక్కడ ఉంటారు.? అంటూ ఎదురైనా ప్రశ్నకు జగన్ తాడేపల్లిలోనే ఉంటారు, విజయవాడ – గుంటూరు మధ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, దీని వల్ల మచిలీపట్టణం వరకు మెగా సిటీ డెవలప్మెంట్ అవుతుందని ఈ విషయాలన్నీ స్వయంగా జగనే చెప్పారంటూ సజ్జల రాజధాని అంశం పై వైసీపీ వైఖరిని స్పష్టం చేసారు.
అయితే సజ్జల చెపుతున్నట్టు తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని పై వైసీపీ నేతలు చెపుతున్న మాటలు, చేస్తున్నా ప్రకటనలు అన్ని అభూతకల్పనలనే అనేది అందరికి తెలిసిన విషయమే. అయినా ఇంకా సజ్జల గతంలో మాదిరే అమరావతే రాజధాని అని ఏపీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినా అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సిద్ధంగా లేదనేది వైసీపీ గ్రహించాలి.




