నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తనకు జగనన్న, ప్రజలు, నియోజకవర్గం అభివృద్ధి తప్ప మరేమీ అవసరంలేదన్నట్లు మాట్లాడుతుంటారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఏనాడూ పైసా అవినీతికి పాల్పడలేదని చెపుతుంటారు. కానీ వైసీపీలో తన విరోధులతో సహా మిగిలిన రాజకీయ నాయకులందరూ వేలకోట్లు అవినీతికి పాల్పడుతుంటారని ఆరోపిస్తుంటారు.
టిడిపి యువనేత నారా లోకేష్ బుదవారం నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గంలోని సాలుచింతలలో యువగళం పాదయాత్రలో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ భూకబ్జాలు, బినామీ భూముల చిట్టాను వాటి డాక్యుమెంట్స్‌తో సహా మీడియాకు విడుదల చేశారు. వాటన్నిటి విలువ సుమారు రూ.1,000 కోట్లు వరకు ఉంటుందని నారా లోకేష్ అన్నారు.
ఒక్క ఛాన్స్ ఇస్తే వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అందరూ అందినకాడికి రాష్ట్రంలో భూములను, కొండలను, గుట్టలను, మట్టి, ఇసుకని దోచేసుకొంటున్నారని, వీరికి మరో ఛాన్స్ ఇస్తే ఇక రాష్ట్రంలో ఏమీ మిగల్చరని నారా లోకేష్ అన్నారు.
ఎమ్మెల్యేకాక మునుపు పెద్దగా ఆస్తులు లేని అనిల్ కుమార్ యాదవ్ కేవలం రెండున్నరేళ్ళు మంత్రిగా పనిచేస్తేనే వెయ్యి కోట్లు ఆస్తులు పోగేశారంటే, మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యే ఏ స్థాయిలో రాష్ట్రాన్ని దోచుకొంటున్నారో ఎవరూ ఊహించలేమని నారా లోకేష్ అన్నారు.
తాను బయటపెట్టిన ఈ భూములతో తనకు సంబంధం లేదని అనిల్ కుమార్ యాదవ్ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేయగలరా? అని నారా లోకేష్ సవాల్ విసిరారు. నారా లోకేష్ విడుదల చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అక్రమాస్తుల చిట్టా…



