సీమ నుండి జగన్ పార్టీ మరో ఎమ్మెల్యే జంప్!

YSRCP MLA Attar Chand Basha joining TDPఅధికార పార్టీలోకి వెల్లువెత్తుతున్న వైసీపీ ఎమ్మెల్యేల జోరు అలాగా కొనసాగుతోంది. తాజాగా రాయలసీమలోని అనంతపురం జిల్లాలోని కదిరికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 వాహనాలలో అనుచరులతో కలిసి భారీ స్థాయిలో టిడిపిలో కాలు మోపేందుకు బాషా రంగం సిద్ధం చేసున్నారని తెలుస్తోంది.

ఈ సమాచారం తెలుసుకున్న వైసీపీ వర్గాలు, చాంద్ బాషా ను బుజ్జగించేందుకు హైదరాబాద్ నుంచి వైఎస్సార్సీపీ నేతలు కదిరికి వెళ్ళగా, అప్పటికే వైసీపీ నేతలకు అందుబాటులో లేని విధంగా బాషా స్కెచ్ వేసుకుని విజయవాడకు బయలు దేరినట్లుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫోన్ స్విచ్చాఫ్ చేసిన చాంద్ బాషా సోదరులు టీడీపీ నేత నారా లోకేష్ తో భేటీ అయ్యారని, ఈ నేపథ్యంలో నేడే టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయని టాక్.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories