
గతంలో అధికారంలో ఉన్నపార్టీలు, ప్రతిపక్షాలు కూడా రాజకీయాలను పార్టీలకు, విధానాలకు మాత్రమే పరిమితం చేసుకొని ఉండేవి. అందువల్లే అప్పుడు రాజకీయాలు ఓ పద్దతిలో సాగేవి. రాజకీయాలలో ఉన్నవారు, వాటి నుంచి తప్పుకున్నవారు కూడా చాలా గౌరవంగా, ప్రశాంతంగా జీవించగలిగేవారు.
కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రత్యర్ధులను చావు దెబ్బ తీసి రాజకీయాలలో పైచేయి సాధించేందుకు, భౌతిక దాడులు, వ్యక్తిగత స్థాయిలో దూషణలు, కేసులు, వేధింపులు వంటి అవాంఛనీయ సంస్కృతిని ప్రవేశపెట్టారు.
Also Read – వైసీపీ ఇప్పుడే ధర్నాలు చేసుకుంటే మంచిదేమో?
ఆ విధానాలను అనుసరించినందుకే పలువురు ఐఏఎస్, ఐపీస్ అధికారులతో సహా వైసీపీ నేతలు నేడు భారీ మూల్యం చెల్లిస్తున్నారు.
కానీ ఈ దుసంస్కృతికి ఇక్కడితో అడ్డుకట్ట వేయాలని సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ భావిస్తూ, వ్యక్తిగత కక్షలకి తాము దూరంగా ఉంటూ, తమ పార్టీ శ్రేణులను కూడా కట్టడి చేస్తున్నారు.
Also Read – ఒకరిది భాషోద్వేగం..మరొకరిది ప్రాంతీయవాదం..మరి ఏపీ.?
వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసుల విషయంలో కూడా జోక్యం చేసుకోకుండా వ్యవస్థలే దిద్దుబాటు చర్యలు తీసుకునేలా చేస్తున్నారు.
దీనినే మెతకవైఖరి అని టీడీపీ, జనసేన శ్రేణులు భావిస్తుంటే, ప్రతీకార రాజకీయాలని వైసీపీ వాదిస్తోంది. తమ హయంలో చేయకూడని తప్పులు చేశామని జగన్ అంగీకరించకపోవచ్చు. కానీ వైసీపీ నేతలందరికీ తెలుసు. మాట పోసాని అదే చెప్పారు కదా?
Also Read – అందరికీ సారీ.. అదిదా సర్‌ప్రీజు!
కానీ సిఎం చంద్రబాబు నాయుడు తమపై అన్యాయంగా, అక్రమంగా కేసులు నమోదు చేయించి రాజకీయ వేధింపులకి పాల్పడుతున్నారంటూ జగన్, వైసీపీ నేతలు బలంగా వాదించడం దేనికంటే ప్రజలను నమ్మించడానికే. వారి సానుభూతి పొందడానికే.
కనుక వారి వాదనలను అర్దం చేసుకోవచ్చు. కానీ తాము అధికారంలోకి వచ్చాక ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని జగన్ హెచ్చరిస్తుండటం చూస్తే తాను సృష్టించి అమలుచేసిన వికృత రాజకీయాలను యధాతధంగా కొనసాగిస్తామని చెపుతున్నారన్న మాట!
ఓ పక్క తన వికృత రాజకీయాల విపరీత పరిణామాలను భరించలేకపోతున్నప్పటికీ భవిష్యత్‌లో కూడా వాటినే కొనసాగిస్తున్నామని బల్లగుద్ది చెపుతున్న జగన్‌కి ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారో లేదో తెలీదు కానీ జగన్ ఈ ధోరణే వైసీపీకి శాపమనుకోవచ్చు.