Sajjala-Ramakrishna-Reddy-Vijaya-Sai-Reddy-

‘దొరికితే దొంగ దొరకక పొతే దొర’ అన్న సామెత సాధారణ ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది అనేలా రాజకీయ నాయకులు తమ వెసులుబాటుకు తగ్గట్టుగా మరో కొత్త సామెతను సృష్టించుకున్నారు. దొరక్కపోతే ‘రాజకీయ సేవకుడు’, దొరికితే ‘కడిగిన ముత్యం’ అనేలా పాత సామెతకు కొత్త రూపాన్ని తీసుకొస్తున్నారు.

Also Read – కింగ్ అందుకుంటాడా.? శర్మ కొనసాగిస్తారా.?

గత ఐదేళ్ల వైసీపీ పాలన లో రాష్ట్రం ఏ స్థాయిలో దోపిడీకి గురయ్యిందో, ఏ మేరకు తన భవిష్యత్ ను కోల్పోయిందో తెలుసుకోవడానికి కూటమి ప్రభూత్వానికి వచ్చిన సీట్ల సంఖ్యను చూస్తే యిట్టె అర్ధమవుతుంది. రాష్ట్రాన్ని మూడు ముగ్గులుగా విభజించి దాన్ని ఐదు భాగాలుగా చేసి అక్కడ జగన్ సామంత రాజులు మాదిరిగా ఐదుగురు రెడ్లు తమ అరాచకాన్ని కొనసాగించారు.

అందులో చిత్తూరు జిల్లా రెడ్డి గారు పెద్ది రెడ్డి ఒకరైతే, సజ్జల రామకృష్ణ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బా రెడ్డి, అవినాష్ రెడ్డి ఇలా ఈ ఐదుగురు కూడా స్థానికంగా ఉన్న ప్రభుత్వ భూములను, ప్రజల ఆస్తులను కబ్జా చేస్తూ అధికారాన్ని హక్కు గా భావించారు. అయితే ఇప్పుడు అనుకోని ఓటమి ఎదురవడంతో ఒకరు రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి దోచుకున్న భూములలో వ్యవసాయం చేయడానికి సిద్ధమయ్యారు.

Also Read – వన్ నేషన్…వన్ ఎలక్షన్…వన్ పార్టీ.?

అయితే ఇప్పుడు తాజాగా పెద్దిరెడ్డి భూ దందా వెలుగులోకి రావడంతో ఆయన అక్రమ అటవీ భూముల ఆక్రమణల పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనితో ఇక వైసీపీ ముఖ్య నేతలు మరియు ఆ ఆక్రమణలతో సంబంధం ఉన్న నాయకులు పెద్దిరెడ్డి కి వకాల్తా పుచ్చుకుని మీడియాలో ప్రత్యక్షమయ్యారు.

కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల మీద కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందని, అందులో భాగంగానే పెద్దిరెడ్డి మీద అసత్య ప్రచారాలు చేస్తూ అవినీతి ఆరోపణలకు పాల్పడుతున్నారంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. అలాగే పెద్ది రెడ్డి కడిగిన ముత్యంలా తన మీద పడిన అక్రమ ఆక్రమణల ఆరోపణల నుంచి బయటకు వస్తారంటూ రాజకీయ నాయకులకు అలవాటైన ప్రకటనలు జారీ చేస్తున్నారు.

Also Read – వ్యవస్థలకి జగన్‌ డ్యామేజ్… చంద్రబాబు రిపేర్స్!


అటు విశాఖ భూ దందాలో విజయ సాయి రెడ్డి భాగోతం, ఇటు చిత్తూరు లోపెద్ది రెడ్డి అటవీ భూముల అక్రమ ఆక్రమణ, ఇక కడపలో సజ్జల గారి భూముల స్వాహా…ఇలా చెప్పుకుంటూ పోతే గత వైసీపీ నాయకుల ఆక్రమణల మీద కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తున్న ఈ నేపథ్యంలో అందరు కడిగిన ముత్యాలే అయితే అసలు ముత్యం ఏమయినట్టు.? అనే ప్రశ్నకు వైసీపీ నేతలు బదులు చెప్పగలరా.?