ఆందోళనలు సక్సస్.. వైసీపీ విజయమా.. కూటమి వైఫల్యమా?

YSRCP Fight Over Electricity Tariff Hike

జగన్‌ పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు విద్యుత్ ఛార్జీల పెంపుని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.

కూటమి ప్రభుత్వం ఓ ఏడాది లేదా రెండేళ్ళ తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచి ఉంటే దానికి అదే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయ్యింది. కనుక విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చింది?అని ప్రశ్నించుకుంటే జగన్‌ ప్రభుత్వం నిర్వాకం వల్లనే అని తెలిసిపోతూనే ఉంది. టీడీపీ కూడా అదే చెపుతోంది.

ADVERTISEMENT

కానీ సంక్రాంతి పండుగ తర్వాత జనం మద్యకు రావాలని జగన్‌ ముహూర్తం పెట్టుకునందున, అందుకు వైసీపీని సమాయత్తం చేసి, ప్రజల నాడి తెలుసుకునేందుకు హడావుడిగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని హుకుం జారీ చేశారు.

ముఖ్యంగా.. విడదల రజనీ వంటి మరికొందరు సీనియర్ నేతలు వైసీపీని వీడి కూటమిలో చేరిపోయేందుకు సిద్దం అవుతున్నారని గుసగుసలు వినిపిస్తునందున, వారూ కూడా ఈ ఆందోళనలలో పాల్గొనేలా చేసి వారి చేతే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయించడం ద్వారా కూటమిలో చేరలేని పరిస్థితి కల్పించాలనే గొప్ప ఆలోచన కూడా ఉంది.

ఈ ఆందోళనలకు దూరంగా ఉండే వారందరూ వైసీపీని వీడబోతున్నారనే స్పష్టత కూడా వస్తుంది. కనుక కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆందోళనలు చేసిన్నట్లు ఉంటుంది. పనిలో పనిగా అసమదీయులు ఎవరో తసమదీయులు ఎవరో కూడా తేలిపోతుందని జగన్‌ భావించిన్నట్లున్నారు.

ఇక కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ నేతలకు కూడా ఇప్పుడు తమ రాజకీయ ఉనికిని చాటుకోవడం, మనుగడని కాపాడుకోవడం రెండూ చాలా అవసరమే కనుక పార్టీలో సీనియర్లు అందరూ నడుం బిగించి నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు.

కనుక ‘విద్యుత్ ఛార్జీల పెంపుకి నిరసనగా ఆందోళనలు’ అనేది వైసీపీని ‘రీయాక్టివ్‌ చేసుకునేందుకు’, ‘లాయల్టీ టెస్టింగ్ చేసుకునేందుకు’ ఒక సాకు మాత్రమే అని భావించవచ్చు.

నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వారి ఆందోళనలు దిగ్విజయంగా జరిగాయి కనుక వైసీపీ నేతలు అందరూ ఈ రెండు పరీక్షలో ఉత్తీర్ణులైన్నట్లే చెప్పొచ్చు.

కానీ విద్యుత్ ఛార్జీల పెంపుకు తమ అధినేత జగన్‌, తమ వైసీపీ ప్రభుత్వమే కారణమనే విషయం నిన్న ఆందోళన చేసిన వైసీపీ నేతలందరికీ కూడా బాగా తెలుసు. కానీ విద్యుత్ ఛార్జీల విషయంలో వైసీపీని గట్టిగా నిలదీయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పక తప్పదు.

ఒకవేళ ఈ అంశంపై కూటమి ప్రభుత్వం వైసీపీని గట్టిగా నిలదీసి, ప్రజలలో చైతన్యం కలిగించి ఉండి ఉంటే, ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు వైసీపీ సాహసించి ఉండేది కాదు. చేసినా ఇంత విజయవంతం అయ్యేదే కాదు కదా?

ADVERTISEMENT
Latest Stories