
రాష్ట్రంలో రెండు పట్టభద్ర. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. కేవలం 5-6 నెలలకే చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్ వాదిస్తుంటారు.
Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?
కనుక విద్యావంతులు ఓటర్లుగా జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసి గెలిచి తన వాదనలు నిజమని నిరూపించుకునేందుకు జగన్‌కి మంచి అవకాశం లభించింది. కానీ ఓటమి భయంతో వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది.
ఈ ఎన్నికలు జరుగక ముందే వైసీపీకి అవమానకరంగా మారబోయే మరో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చి పడ్డాయి. టీడీపీ ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, పర్చూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బి. తిరుమల నాయుడు పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది.
Also Read – జగన్ గుర్తించలేని మెగాస్టార్‌ని బ్రిటన్ గుర్తించింది!
వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీకి, పదవికి రాజీనామా చేసి సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ సీటు కూడా ఖాళీగా ఉంది.
కనుక ఈ 5 ఎమ్మెల్సీ సీట్లకు కేంద్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ : నోటిఫికేషన్: మార్చి 3; నామినేషన్స్ గడువు: మార్చి 10; పోలింగ్: మార్చి 20 ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.
Also Read – కోటరీ రియాక్షన్ లేదేమిటి?
ఇవి ఎమ్మెల్యేల కోటాలో జరుగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కనుక శాసనసభలో సంఖ్యాబలం ఆధారంగానే అభ్యర్ధులను బరిలో దింపాల్సి ఉంటుంది.
వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున ఒక్క అభ్యర్ధిని కూడా పోటీ చేయించలేదు. మొత్తం 5 సీట్లు కూటమికే లభిస్తాయి. కనుక కూటమి పార్టీలు ఎవరిని అభ్యర్ధులుగా ప్రకటిస్తే వారు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికైపోయిన్నట్లే!
వైసీపీకి తగినంత మంది ఎమ్మెల్యేలు లేరు కనుక ఈ ఎన్నికలలో పోటీ చేయలేకపోవచ్చు. కానీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా జగన్ మళ్ళీ ‘మేమే అధికారంలోకి వస్తాము.. మరో 25-30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తానని’ గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు, కనీసం ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలేని దుస్థితికి వైసీపీ దిగజారడం అవమానమే కదా?
అయినా జగన్ రాష్ట్రంలో ఇష్టారా