
వైసీపీ నేతలకి వారి అధినేత జగన్‌కి ఎప్పుడూ తొందర ఎక్కువే. లేడికి లేచిందే పరుగు అన్నట్లు ముందూ వెనుకా చూసుకోకుండా సిఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించడానికి ఏ చిన్న అవకాశం లభించినా రెచ్చిపోతుంటారు.
“చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారని మోడీ ప్రభుత్వం మనుగడ ఆయనపైనే ఆధారపడి ఉందని టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటారు. కేంద్ర బడ్జెట్‌లో బిహార్‌కి నితీశ్ కుమార్ భారీగా నిధులు, ప్రాజెక్టులు సాధించుకోగలిగారు కానీ చంద్రబాబు నాయుడు ఏపీకి ఒక్క రూపాయి సాధించలేకపోయారు,” అంటూ విమర్శలు గుప్పించారు.
Also Read – దేశంలో ఇక బీజేపి ఒక్కటే… అడ్డేలే!
కానీ బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన నిధులు, ప్రాజెక్టుల గురించి ఒక్కో వివరాలు ప్రకటిస్తుంటే ఇప్పుడు వైసీపీ నేతలకు చెంపదెబ్బలు కొడుతున్నట్లే ఉంది. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ బడ్జెట్‌లో ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు రూ.9,417 కోట్లు, తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించాము.
ప్రస్తుతం ఏపీలో రూ.84,559 కోట్లు వ్యయంతో అనేక రైల్వే ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 1,560 కిమీ మేర రైల్వే ట్రాక్ నిర్మించాము. విశాఖ, రాజమండ్రి, విజయవాడ రైల్వే స్టేషన్లను ఆధునీకరణ పనులు చేపట్టాము.
Also Read – అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి కారన్న మాట!
గత ఏడాది బడ్జెట్‌లోనే ఏపీ రాజధాని అమరావతిని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలను కలుపుతూ కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ.2,545 కోట్లు కేటాయించాము. ఆ పనులు జోరుగా సాగుతున్నాయి,” అని చెప్పారు.
ఇదికాక కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి రూ.5,936 కోట్లు, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి రూ.3,295 కోట్లు, విశాఖ పోర్టుకి రూ.730 కోట్లు, రాష్ట్రంలో జాతీయ రహదారుల, ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రూ.240 కోట్లు కేంద్రం మంజూరు చేసింది.
Also Read – ఆప్ ఓటమికి బిఆర్ఎస్ స్కాములే కారణమా..?
దావోస్ సదస్సు నుంచి చంద్రబాబు నాయుడు ఖాళీ చేతులతో తిరిగివచ్చారని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. కానీ ఆ సదస్సులో పలు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని, ఆ విషయం ప్రకటించకుండా రహస్యంగా ఉంచారని దావోస్ సదస్సుకి హాజరైన తెలంగాణ ఐటి మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు.
కనుక రాబోయే రోజుల్లో దేశవిదేశాలకు చెందిన పరిశ్రామికవేత్తలు, ఐటి కంపెనీల ప్రతినిధులు వచ్చి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏయే పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నారో ప్రకటిస్తే అప్పుడు జగన్ వైసీపీ నేతలు తల ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి.
అయినా దావోస్ సదస్సులో లేదా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు, కంపెనీలు రాకపోతే బాధ పడాలి కానీ సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించేందుకు అవకాశం లభించిందని వైసీపీ నేతలు పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారు.