
కుటుంబాలు చీల్చే రాజకీయాలు చేయడంలో వైసీపీ ది అందివేసిన చెయ్యి అని మరోసారి రుజువు చేసుకుంటున్నారు. అయితే ఆ పాపమే ఇప్పుడు తల్లి విజయలక్ష్మి రూపంలో చెల్లెల్లు షర్మిల, సునీత అవతారంలో వైసీపీని వెంటాడుతున్నాయి.
Also Read – వైసీపీ వైరస్ కి జైలే వాక్సిన్..?
అయినా ఇంకా వైసీపీకి తత్త్వం బోధపడడంలేదు. ఇప్పటికి పక్క వారి కుటుంబ వ్యవహారాలతో రాజకీయం చేసి దాన్ని వైసీపీకి సానుకూలంగా మలచుకోవాలనే ఆ పార్టీ నేతల తాపత్రయం నానాటికి దాని పరిధిని దాటి బలపడుతుంది.
గతంలో టీడీపీ పార్టీని ఇరుకునపెట్టడానికి, చంద్రబాబు, లోకేష్ లకు చెక్ చెప్పడానికి నారా కుటుంబంతో నందమూరి విబేధాలు అంటూ జూ.ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తూ పదేపదే టీడీపీ నేతల సహనాన్ని పరీక్షించారు వైసీపీ నేతలు.
Also Read – కథ నచ్చితే ‘అమ్మ’ అయినా ‘అమ్మమ్మ’యినా ఒకే..
ఇక తారక్ ఊసు పాత చింతకాయ పచ్చడి మాదిరి చప్పబడిపోవడంతో లేటెస్ట్ కాంట్రవర్సీ ఇష్యూ అయిన అల్లు vs మెగా కంపౌండ్ల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వివాదాన్ని తలకెత్తుకున్నారు వైసీపీ నేతలు.
అల్లు అర్జున్ భుజం మీద నుంచి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుతున్నారు వైసీపీ బ్యాచ్. అల్లు అర్జున్ మీద విపరీతమైన ప్రేమ కురిపిస్తూ జనసేన నేతలను, పవన్ అభిమానులను రెచ్చకొట్టేలా మాజీ మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
Also Read – రఘురామని కూడా బాబు కాపాడుకున్నారు.. మరి వంశీని?
నాకు తెలిసి అందరు పుష్ప-2 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు, వారిలో నేను కూడా ఒకడినే, పుష్ప – 1 హాలీవుడ్ స్టయిల్ లో ఉండడంతో ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని పుష్ప – 2 మరింతగా క్రెజ్ దక్కించుకుంది.
ఈ సినిమాతో అల్లు అర్జున్ అందరిని తలతన్నే విధంగా ఎక్కడికో వెళ్ళాడు కదా, దాన్ని చూసి కొంతమందికి జలసీతో కడుపు కుళ్లిపోతుంది అంటూ పరోక్షంగా మెగా అభిమానులను, జనసేన కార్యకర్తలను రెచ్చకొడుతూ బన్నీ, పవన్ ఫాన్స్ మధ్య రగులుతున్న మంటలో కాస్త వైసీపీ తీర్థం పోసి రాజకీయ చలి కాచుకుంటున్నారు అంబటి.
అయితే బన్నీ మీద ఇంతటి ప్రేమ కురిపిస్తూ, పుష్ప సినిమా మీద ఇన్ని ప్రశంసలు గుప్పించిన ఈ వైసీపీ నేతలు తమ ప్రభుత్వ హయాంలో టికెట్ రేట్ల పెంపు విషయంలో పుష్ప టీం కు ఝలక్ ఇచ్చిన విషయం మరిచినట్టున్నారు. దీనితో దేశ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించిన పుష్ప ఏపీలో మాత్రం నామమాత్రపు వసూళ్లతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.
ఆ సమయంలో బన్నీ మీద ఉన్న ప్రేమంతా, పుష్ప సినిమా మీద ఉన్న అభిమానమంతా ఏ థియేటర్లో దాచిపెట్టారో అంబటి గారు సెలవిస్తే బాగుంటుందిగా. అసలు ఈ వివాదానికి పునాది వేసిన బన్నీస్నేహితుడు వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్ర కానీ ఇప్పుడు బన్నీ తరుపున వకాల్తా పుచ్చుకున్న అంబటి రాంబాబు కానీ పుష్ప-1 టికెట్ల పెంపు కోసం జగన్ తో మధ్యవర్తిత్వం చేయలేకపోయారే..? అనే ప్రశ్నకు ఇప్పుడుఈ వైసీపీ నేతలు బదులివ్వగలరా.?
అసలు ఎదుటి వారి కుటుంబాల మీద కుళ్ళు రాజకీయం చేసే ముందు సొంత కుటుంబంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకోవచ్చు కదా. ఇటు అంబటి విషయానికి వస్తే సొంత అల్లుడే అంబటి మీద తీవ్ర విమర్శలు చేసి అతడిని ఒక దుర్మార్గుడిగా పేర్కొన్నారు.
అయితే ఇప్పటికి ఆ విమర్శలకు అంబటి సమాధానం చెప్పుకోలేక ఇది టీడీపీ, జనసేన కుట్రలో భాగమే అంటూ మాట దాటేస్తూ, ఇది తన కుటుంబ వ్యవహారం, దీనిపై రాజకీయం చేయడం హీనమైన చర్య అంటూ నీతి ప్రవచనాలు కూడా వల్లెవేశారు అంబటి.
ఇక వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా కన్న తల్లి, సొంత చెల్లి మీద కోర్టులో కేసులు వేస్తూ, సొంత బాబాయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న వారిని కాపుకాస్తు, బాధితులైన సునీతా కుటుంబం మీద బూతు రాజకీయానికి తెరలేపారు.
ఇటువంటి చరిత్రను వెనుకేసుకుని కూడా ఇంకా వైసీపీ నేతలు పక్క వారి కుటుంబ వివాదాలతో రాజకీయ లబ్ది పొందుదాం అనుకుంటున్నారంటే ఇక వైసీపీ నేతల రాజకీయ విలువలు ఏపాటివో, ఆ పార్టీ సిద్ధాంతం ఏమిటో యిట్టె అర్ధమవుతుంది.
తమ పైన, తమ పార్టీ పైన సొంత కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక వాటిని డైవర్ట్ చేయడానికి ఇలా తమకు సంబంధం లేని విషయాలలో వేలు పెడుతూ కుటుంబాలు చీల్చే రాజకీయాలు ఇంకెంతకాలం నడుపుతుంది వైసీపీ.
అప్పుడు టీడీపీ ని ఇరుకున పెట్టడానికి కొడాలి, వల్లభనేని వంటి నేతలతో జూ.ఎన్టీఆర్ ను అడ్డుపెట్టుకుని రాజకీయం నడిపిన వైసీపీ, ఇప్పుడు జనసేనను టార్గెట్ చేయడానికి అంబటి, శిల్పా రవి ని తెరమీదకు తెచ్చి బన్నీ తో రాజకీయం చేస్తున్నారు.
అయితే సదరు హీరోల మౌనమే వైసీపీ ఆయుధంగా మారుతుంది. మన వేలుతో మన కళ్ళే పొడిచి ఆ బాధ పై రాజకీయం చేసే విష సంస్కృతీ వైసీపీ సిద్ధాంతం. దీన్ని గ్రహించి సదరు రెండు కుటుంబాలు జాగ్రత వహించాల్సి ఉంటుంది. లేదంటే మొక్కై ఉన్న వివాదం విష వృక్షంగా మారే ప్రమాదం ఉంది.