అవిశ్వాసతీర్మానం మానేసి విశ్వాసతీర్మానం గానీ పెడతారా ఏంటి జగన్?

YSRCP u turn on no confidence motionకేంద్రప్రభుత్వం మీద అవిశ్వాసతీర్మానం పెట్టబోతున్నాం అని, దమ్ముంటే చంద్రబాబు అతని పార్టనర్ కలిసి రావాలని గత నెలరోజులుగా జగన్ చేస్తున్న సవాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. మొదట మార్చి 21న అనుకున్న నిన్న ప్లాన్ మార్చేసి సోమవారమే అవిశ్వాసం పెడతాం అని ప్రకటించారు ఆ పార్టీ నేతలు. అయితే దీనిపై ఆ పార్టీ చిత్తశుద్ధి నమ్మశక్యంగా లేదు.

ADVERTISEMENT

జాతీయ మీడియాలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, జగన్ అంతరంగికుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తాము కాంగ్రెస్ తో ఎప్పటికీ కలవము అని, తమకు ప్రధాన మంత్రి మోడీ స్పెషల్ స్టేటస్ ఇస్తారనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. స్పెషల్ స్టేటస్ ఇస్తే బీజేపీతో కలవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

మోడీ పై అంత నమ్మకం ఉంటే ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం దేనికి? ఇలాంటి చేష్టలు వ్యాఖ్యలతో ప్రజలలో ఎలా నమ్మకాన్ని నింపాలని చూస్తున్నారో? పోనీ ఎవరో అన్నారు అంటే అనుకోవచ్చు సాక్షాత్తు విజయసాయిరెడ్డి అంటే జగన్ అన్నట్టే. ఇక్కడొక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడి మళ్ళీ విశ్వసనీయత అంటారు. కొంపతీసి అవిశ్వాసతీర్మానం మానేసి విశ్వాసతీర్మానం గానీ పెడతారా ఏంటి జగన్?

ADVERTISEMENT
Latest Stories