ys-jagan-11-mins-ap-assembly

ప్రజా సమస్యల పై అసెంబ్లీలో లో ‘సింహగర్జన’ అంటూ జగన్ కు ఎలివేషన్లు వేసిన వైసీపీ చివరికి పిల్లిలా తోకముడిచింది. అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగం మొదలైన 11 నిముషాలకే జగన్ తో సహా వైసీపీ లో ఉన్న 11 మంది ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు వాక్ అవుట్ పేరుతో పలాయనం చిత్తగించారు.

60 రోజుల అటెండెన్స్ అంటూ తెరమీదకొచ్చిన అనర్హత వేటు భయంతో అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్ అండ్ కో అందరు ఊహించిన విధంగానే వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్లారు. గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టిన కొన్ని క్షణాలకే జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సభలో నినాదాలు మొదలుపెట్టిన వైసీపీ నేతలు చివరికి తమ డ్రామాకు తెరదింపి గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగానే సభనుంచి వాక్ అవుట్ చేసారు.

Also Read – కొడాలి నాని అధ్యాయం ప్రారంభం!

దీనితో జగన్ ఆడుతున్న డ్రామా, వైసీపీ చేస్తున్న రాజకీయం పట్ల ప్రజలలో స్పష్టత ఏర్పడింది. ప్రజాస్వామ్యం పట్ల మర్యాద, ప్రతిపక్షం పట్ల గౌరవం అంటూ వైసీపీకి చేతకాని, చేయలేని పనులను కూటమి ప్రభుత్వం ఆచరించాలంటూ సుద్ద పూస కబుర్లు చెపుతున్న వైసీపీ నేతలు అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా అనేది ఎవరు ఇస్తారో, ఎవరు ఇవ్వాలో తెలుసుకోలేకపోతున్నారా.?

ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే అది ప్రజలచేత ఇవ్వబడాలి. అంతేకాని ఎవరికీ నచ్చినట్టు వారికి, వారి పార్టీలకు హోదాలు ఇవ్వడం అనేది ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకం. వైసీపీ కి ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా, జగన్ కు దక్కని ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు కోసం ప్రభుత్వం తో పోరాడితే ఫలితం ఉంటుందా.? ఇది ప్రజా తీర్పుని అవమానించినట్టు కాదా.?

Also Read – చంద్రబాబు-బిల్ గేట్స్: ఈ ఒక్క ఫోటో చాలు!

అయినా కూడా తమ ఆవేదనలో బలముంది, తమ వాదనలో నిజాయితీ ఉంది అని వైసీపీ నమ్మినట్లయితే సభలో పాల్గొని తమ అభిప్రాయాన్ని డిమాండ్ మాదిరి కాకుండా అభ్యర్ధన రూపంలో అడిగి తేల్చుకోవాలి. అంతేకాని ఇలా గౌరవ రాష్ట్ర గవర్నర్ ప్రసంగిస్తుంటే అరుపులు, కేకలతో సభ నుంచి నిష్క్రమించడం ఎంతవరకు సమంజసం.? గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం సభలో ఆచరించిన సంప్రదాయాలు ఇవేనా.?

నాడు ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వని గౌరవం, ప్రతిపక్ష నేతలకు దక్కని మర్యాదలు ఇప్పుడు వైసీపీకి, జగన్ కి కావాలంటూ వైసీపీ చేస్తున్న రాజకీయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇటువంటి చర్యలతో జగన్ చేచేతుల తన గౌరవాన్ని, తన పార్టీ ప్రతిష్టను తానే తగ్గించుకుంటున్నారు.

Also Read – అందగాళ్ళ అరెస్టులు…సౌమ్యుల రాజీనామాలు..!


అయినా చట్ట సభలలో మాట్లాడాల్సింది ప్రజా సమస్యల గురించి, ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది ప్రజా వ్యతిరేక విధానాల గురించి. అంతేకాని తమ పార్టీ స్వప్రయోజనాల కోసమో, తమ నాయకుడి వ్యక్తిగత హోదాల మేరకో అసెంబ్లీకి వెళ్లాల్సిన పనిలేదు, అదే విషయాన్ని మీడియాలో ప్రస్తావించినా సరిపోతుంది. ఇలా మొత్తానికి ఈ 11 నిముషాల జగన్నాటకంతో 11 మంది వైసీపీ ఎమ్మెల్యే లు మరో 60 రోజుల పాటు సభకు రావాల్సిన పనిలేకుండా పోయిందన్నమాట.