
అమెరికా-ఉక్రెయిన్ దేశాధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్- జెలెన్‌స్కీ శుక్రవారం వైట్‌హౌస్‌లో మీడియా సమక్షంలో సమావేశమయ్యారు. జెలెన్‌స్కీ ఎటువంటివారో అమెరికా ప్రజలకు తెలియాలనే మీడియా సమక్షంలో ఈ సమావేశం నిర్వహించామని ట్రంప్ స్వయంగా చెప్పారు. కానీ ఆయన అనుకున్నది ఒకటి జరిగినది మరొకటి.
ఈ సమావేశం ద్వారా జెలెన్‌స్కీని ఓ దుర్మార్గుడు, యుద్ధ కాంక్షతో రగిలిపోతున్నవాడిగా ప్రపంచానికి చూపించాలని ట్రంప్ అనుకుంటే, యూరోపియన్ దేశాలన్నీ ట్రంప్‌నే తప్పు పడుతూ జెలెన్‌స్కీని హీరో అని మెచ్చుకుంటున్నాయి.
Also Read – జగన్ గుర్తించలేని మెగాస్టార్‌ని బ్రిటన్ గుర్తించింది!
ఈ సమావేశాన్ని చూసిన యూరోపియన్ దేశాలన్నీ ట్రంప్ తీరుని తప్పు పట్టాయి. ఉక్రెయిన్‌కి అండగా నిలవాల్సిన ట్రంప్, ఆ దేశంపై మూడేళ్ళుగా దాడులు చేసి లక్షలాదిమంది ప్రజలను బలి తీసుకుంటున్న రష్యా అధ్యక్షుడు పుతీన్‌కి మద్దతుగా మాట్లాడుతున్నారని విమర్శించాయి.
కానీ ట్రంప్ బెదిరింపులకు జెలెన్‌స్కీ ఏమాత్రం భయపడకుండా ఓ వీరుడిలా గట్టిగా జవాబులు ఇచ్చారని యూరోపియన్ దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, యూకే, స్వీడన్, స్పెయిన్, పోలాండ్, ఐర్‌లాండ్, ఐజ్‌లాండ్ తదితర దేశాధినేతలు, వారి అధికార ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
Also Read – ఇవి కదా… సంస్కరణలంటే?
డోనాల్డ్ ట్రంప్ ఓ దురాక్రమణదారుడుని వెనకేసుకువస్తూ చిన్న దేశమైన ఉక్రెయిన్‌పై బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటని వారు అభిప్రాయపడ్డారు.
ఉక్రెయిన్ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఒంటరి కాదని, ఆ దేశానికి, దానిని కాపాడుకోవడం పోరాడుతున్న జెలెన్‌స్కీకి యూరోపియన్ దేశాలన్నీ బాసటగా నిలుస్తాయని ఆయా దేశాల అధికార ప్రతినిధులు చెప్పారు.
Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..
యూరోపియన్ దేశాలలో ఒక్క హంగేరీ మాత్రం జెలెన్‌స్కీ తీరుని తప్పు పడుతూ ట్రంప్ వైఖరిని గట్టిగా సమర్ధించింది.
“బలవంతులు శాంతి కోరుతారు. బలహీనులు యుద్దం కోరుకుంటారు. ట్రంప్ అభిప్రాయాలను చాలా మంది జీర్ణించుకోలేనప్పటికీ ఆయన చాలా ధైర్యంగా శాంతి కోసం ప్రయత్నించారు. థాంక్ యు ప్రెసిడెంట్,” అంటూ హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బాన్ ట్వీట్ చేశారు.
వైట్‌హౌస్‌లో నిన్న జరిగిన ఈ ఒక్క సమావేశంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. యూరోపియన్ దేశాలన్నీ ఒకవైపు, అమెరికా రష్యా మరోవైపు అన్నట్లు మారింది.
గమ్మత్తైన విషయం ఏమిటంటే ఎన్నో దశాబ్ధాలుగా అమెరికా-రష్యా మద్య కోల్డ్ వార్ సాగింది. ఒక దేశాన్ని మరొకటి దెబ్బ తీసేందుకు ప్రయత్నించేవి. అటువంటి బద్ద శత్రు దేశాలు ఇప్పుడు ఒక్కటయ్యాయి.
మరోవైపు ఇంతకాలం యూరోపియన్ దేశాలు అమెరికాని మిత్రదేశంగా భావిస్తుండేవి. అమెరికా కూడా వాటితో అలాగే ఉండేది. కానీ ఈ సమావేశం తర్వాత అవన్నీ అమెరికాని శత్రువుగా భావించడం మొదలుపెట్టాయి. ట్రంప్ నోటి దురుసు, అహంభావం వల్ల చిరకాల మిత్రులను దూరం చేసుకుంటున్నారని అర్దమవుతూనే ఉంది.
ఎప్పటికైనా కెనడా అమెరికాలో కలిసిపోతుందంటూ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు గమనిస్తే, ఆయనకి కూడా పుతీన్‌లాగే రాజ్య విస్తరణ కాంక్ష ఉన్నట్లు అర్దమవుతుంది. కనుక ఇంచుమించు ఓకే రకమైన ఆలోచనలు ఉన్నందునే వారి మద్య దోస్తీ కుదిరిందేమో?
కానీ పులి, సింహం ఎన్నడూ కలిసి ఉన్న దాఖలాలు లేన్నట్లే, ఏదో రోజున ఇద్దరిలో ఎవరో ఒకరు గీత దాటితే అమెరికా-రష్యా మద్య కధ మళ్ళీ మొదటికొస్తుంది.
ట్రంప్ రష్యాకు అనుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేశారు కనుక పుతీన్ ఇంకా చెలరేగిపోయి, యుద్ధాన్ని ఉక్రెయిన్ పక్కనే ఉన్న యూరోపియన్ దేశాలకు విస్తరిస్తే, అప్పుడు ట్రంప్ చెప్పిన్నట్లే మూడో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది. దానికి ట్రంప్, పుతీన్, జెలెన్‌స్కీ ముగ్గురిలో ఎవరు బాధ్యులు??