వైసీపీ రాత మార్చిన 2024 …

ysr-congress-party-fate-in-2024

నేటితో 2024 కు వీడ్కోలు పలుకుతూ ఒక్కసారి ఈ ఏడాదిలో వైసీపీ ఎత్తుపల్లాలను చర్చించుకుందాం. ముప్పైఏళ్ళ పాటు అధికారం మాదే అంటూ విర్రవీగిన వైసీపీ నేతల అత్యుత్సహం ఏ ఏడాది మొదలైన మూడు నెలలకే ఆవిరైపోయింది.

151 సీట్లతో అధికారం అనే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వైసీపీ నేతల కళ్ళు తెరిపించారు ఏపీ ప్రజలు. బటన్ నొక్కాను, రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపించాను, ప్రతిపక్ష పార్టీల నేతలను కట్టడి చేయగలిగాను ఇక నాదే విజయం అంటూ సొంత మీడియా లో డబ్బాలు కొట్టుకుంటూ వై నాట్ 175 అంటూ వాస్తవికతకు దూరంగా వెళ్లిపోయిన వైసీపీని 11 సీట్లతో పాతాళానికి తొక్కాయి కూటమి పార్టీలు.

ADVERTISEMENT

అయితే ఈ 2024 వైసీపీని రాజకీయంగానే కాదు నైతికంగాను పతనం చేసిన ఏడాది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే రాష్ట్రానికి కష్టాలు వరదల రూపంలో వచ్చి పలకరించాయి. అయితే విజయవాడలో వచ్చిన వరదల కన్నా ప్రకాశం బ్యారేజ్ గేట్లను తాకిన వైసీపీ బోట్ల మీదే ఎక్కువ రచ్చ జరిగింది.

వైసీపీ రంగులతో వచ్చిన మూడు బొట్లు ప్రకాశం బ్యారేజ్ గేటును తాకి వాటి మధ్య ఇరుక్కుపోయాయి. దీనితో బ్యారేజ్ గేట్లు పాక్షికంగా దెబ్బ తినడంతో వైసీపీ కావాలనే ఈరకమైన చర్యలకు పాల్పడుతుందంటూ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఇదిలా ఉంటే సందులో సడేమియా అన్నట్టుగా వైసీపీ మరోసారి ఏపీ రాజధాని అమరావతి వరద నీటితో మునిగిపోయింది అంటూ విష ప్రచారం మొదలుపెట్టింది. ఈ రెండు ఘటనలు కూడా వైసీపీ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టాయి. అయితే ఈ వివాదం ఇంకా సద్దుమనగక ముందే తిరుమల శ్రీవారి ప్రసాదం అంశం తెర మీదకు వచ్చింది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం లో జంతువుల కొవ్వు కలిసింది అనే ఆరోపణలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అరాచకాలను బయటపెట్టారు. దీనితో ఒక్క ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డు కల్తీ మీద వైసీపీ విధానాల మీద చర్చ జరిగింది.

దీనితో హిందూ సమాజంతో పాటుగా వెంకన్న భక్తులందరూ వైసీపీ మీద యుద్ధం ప్రకటించారు. ఇక ఈ వివాదం వైసీపీని రాజకీయంగానే కాదు నైతికంగా కూడా కుంగతీసింది. ఇక ఇవి ఇలా కొనసాగుతున్నప్పటికీ దానికి సమాంతరంగా వైసీపీ నేతల అక్రమ సంబంధాల చిట్టా ఒక్కక్కొకటిగా మీడియా ముందుకొచ్చాయి.

ఆరు పదుల యవస్సులో ఉన్న విజయ సాయి రెడ్డి, శాంతిల వివాదం కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్, వాణి, మాధురిల రచ్చ కావొచ్చు, వీటి పై జగన్ మౌనం కావచ్చు ఇవన్నీ కూడా వైసీపీని చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి…..అనేలా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులను ప్రయివేట్ సైన్యంగా చేసుకుని గత ఐదేళ్లు వైసీపీ చేసిన అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో వైసీపీ మరింతగా పతనమయ్యింది.

ఇక గత ఐదేళ్లు వైసీపీ సోషల్ మీడియా చేసిన దుర్మార్గానికి బోరుగడ్డ, వర్రా రవీంద్ర వంటి కొంతమంది వైసీపీ సానుభూతి పరులు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. ఇక శ్రీ రెడ్డి, పోసాని కృష్ణ మురళి వంటి వారి తప్పయింది క్షమించండి అంటూ సద్దుకున్నారు. అయితే వీరందరి వెనుక ఉన్న అజ్ఞాత వ్యక్తి, అదృష్ట శక్తి మాజీ ముఖ్యమంత్రే అన్నది ప్రజలకు కూడా తేటతెల్లమవ్వడంతో జగన్ నైతికంగా పతనమయ్యేరు.

దానికి తోడు తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల మీద తండ్రి ఆస్తి కోసం జగన్ కోర్ట్ కెళ్ళడం, వారి పైనే తన సొంత సాక్షిలో వ్యతిరేక కథనాలు ప్రచారం చేయడం కూడా వైస్ జగన్ విలువలను, విశ్వసనీయతను ప్రశ్నించాయి. అలాగే గత ఐదేళ్లు తాడేపల్లి ప్యాలస్ గేట్ దాటి బయటకు రాని జగన్ ఇప్పుడు మాత్రం ఏపీ ని ఒక విడిది కేంద్రంగా చేసుకుని బెంగళూరు ప్యాలస్ రాజకీయాలు నడుపుతున్నారు.

అధికారంలో ఉంటే పరదాలు కావాలన్నారు. ఇప్పుడు ప్రజలే ముఖ్యమంటున్నారు. గత ఐదేళ్లు చట్ట సభలను విపక్షాలను హేళనచేయడానికి, అవమానించడానికి వాడుకున్న జగన్ ఇప్పుడు మాత్రం ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ కి వస్తాను అంటూ వాదిస్తూ ప్రజలలో పలుచనయ్యారు. ఇలా ఈ 2024 వైసీపీ పార్టీని, ఆ పార్టీ నాయకులను ప్రజల ముందు రాజకీయంగానే కాదు నైతికంగా కూడా పతనం చేసింది.

ADVERTISEMENT
Latest Stories