2029 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ vs వైసీపీ భవితవ్యం అన్న చందంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇన్నాళ్ళుగా టీడీపీ vs వైసీపీ గా సాగిన ఏపీ ఎన్నికలు ఇప్పుడు ఏపీ vs వైసీపీ గా మారనున్నాయా.?
గత ఐదేళ్ల వైసీపీ పాలన విభజన గాయాలను కూడా చిన్నవిగా చేసేశాయి. ప్రజా వేదిక కూల్చివేతలో మొదలైన వైసీపీ విధ్వంశం రాజధాని మార్పు నిర్ణయంతో పతాకస్థాయికి చేరింది.
స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ, ఒక ప్రాంత విధ్వంసానికి పూనుకున్నారు. ఆ ఒక్క నిర్ణయం ఏపీని దేశంలోనే రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా నిలబెట్టింది.
ఆ ఒక్క నిర్ణయమే పారిశ్రామిక వేత్తలను రాష్ట్రం సరిహద్దులు దాటించింది. ప్రభుత్వంలోకి వచ్చింది రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు ప్రత్యర్థి పార్టీ వినాశనం కోసం అన్న చందంగా సాగిన వైసీపీ పాలన ప్రతిపక్ష పార్టీ నాయకుల సహనానికి పరీక్ష పెడితే, అవే వైసీపీ విధానాలు సామాన్య ప్రజానీకానికి అసహ్యాన్ని పుట్టించాయి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఒక్క ఇటుక పేర్చలేకపోయారు, విశాఖలో ఒక్క పరిశ్రమ స్థాపించలేకపోయారు. కేవలం బటన్లు నొక్కడానికే ప్రభుత్వం అంటూ వందల కొద్ది సలహాదారులను, వేల కొద్ది వాలంటీర్లను నియమించుకుని 151 మంది వైసీపీ ఎమ్మెల్యే లతో ఏపీ వినాశానికి పునాదులు తొవ్వారు వైస్ జగన్.
దాని ఫలితమే వైసీపీ వై నాట్ 175 అంటే ప్రజలు 11 చాలు మహా ప్రభో అంటూ జగన్ కు దండం పెట్టి వైసీపీ కి దండేసారు. అయితే ఓటమితో అయిన వైసీపీ కి ప్రజా తీర్పుకి అర్ధం తెలుస్తుంది, వైసీపీ పాలన విధ్వంశం విలువ అర్ధమవుతుంది అనుకుంటే వైసీపీ ఓటమి మీద సమీక్షలు చేయకుండా అదే విధ్వంసాన్ని కొనసాగిస్తూ జగన్ 2.0 అంటూ ముందుకు వెలుతుంది.
కూటమి రాక తో ఒక్కో వ్యవస్థ గాడిన పడుతూ రాష్ట్రంలో సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా జరుగుతుంది అనేలా గత ఏడాదిలో ఏపీకి రాజధానిగా అమరావతికి పట్టాభిషేకం జరిగింది. ప్రజలకు బూతుల మంత్రులు, దాడుల నాయకుల నుంచి విముక్తి దొరికింది.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు పారిశ్రామిక ప్రగతికి అడుగులు పడుతున్నాయి. ఇందుకుగాను విశాఖను ఐటీ హబ్ గా, అమరావతిని ఎడ్యుకేషనల్ హబ్ గా శ్రీ సిటీ ని ఇండస్ట్రియల్ హబ్ గా ఇలా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి పునాదులు పడుతున్నాయి.
ఈ పునాదులు అమరావతి నిర్మాణాల మాదిరి సమాధులు కాకూడదు అనుకుంటే, రాష్ట్ర భవిష్యత్ మరోసారి కక్ష్య రాజకీయాలలో బంది అవ్వకూడదు. కూల్చివేతల నాయకుల చేతులో అధికారం అస్త్రం గా మారకూడదు. వైసీపీ ఓటమిలోను హింసనే వెతుకుతుంది, విధ్వంసాన్నే కోరుకుంటుంది.
ఇందుకు జగన్ పర్యటనలు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తుంటే, సాక్షి ప్రచారాలు పరోక్ష మద్దతును అందిస్తున్నాయి. వైసీపీ నాయకులు జగన్ అరాచకానికి వంత పాడుతుంటే, వైసీపీ క్యాడర్ దానికి క్రియా శీల రూపం ఇస్తున్నారు.
దీనితో 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ కు జీవన్మరణ సమస్యగా మారితే 2029 ఎన్నికలు ఏపీ భవిష్యత్ కు సవాల్ గా మిగలనున్నాయి అన్న ప్రశ్న మొదలయ్యింది.




