‘కాలం’ చేసిన గిరిబాబు సతీమణి శ్రీదేవి!

actor giri babu wife no moreప్రముఖ తెలుగు చిత్రాల నటుడు, నిర్మాత, ప్రస్తుత క్యారెక్టర్ ఆరిస్ట్ గిరిబాబు సతీమణి ఎర్ర శ్రీదేవి బుధవారం అర్ధరాత్రి కాలం చేసారు. దాదాపుగా మూడు సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శ్రీదేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

గిరిబాబు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రఘుబాబు ఓ స్థాయి నటుడిగా స్థిరపడ్డ వైనం తెలిసిందే. శ్రీదేవి మృతదేహాన్ని స్వగ్రామమైన ప్రకాశం జిల్లా రావినూతలకు తరలించి శుక్రవారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు గిరిబాబు కుటుంబానికి సంతాపం తెలిపారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories