‘అగ్రిగోల్డ్’ కేసులో లాయర్ కు 1.5 కోట్లు లంచం!

Agri gold controversyతెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసు, కన్నడ నాట పెను సంచలనాన్ని సృష్టించింది. అగ్రి గోల్డ్ సంస్థ చైర్మన్, డైరెక్టర్లు ఉడిపి కోర్టులోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు 1.5 కోట్లు లంచం ఇవ్వజూపినట్లుగా పబ్లిక్ ప్రోసిక్యూటర్ స్వయంగా కోర్టుకు ఫిర్యాదు చేశారు. అగ్రిగోల్డ్ లో కన్నడ వాసులు కూడా వందల సంఖ్యలో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.

వీరి ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని యోచిస్తుండగా, అగ్రిగోల్డ్ పై ఉడిపి కోర్టులో కేసు నడుస్తోంది. తనను లోబరచుకునేందుకు భారీ ఎత్తున లంచం ఇవ్వజూపారని ఆరోపిస్తూ, పీపీ ప్రభుత్వానికి, కోర్టుకు కొద్దిసేపటి క్రితం నివేదికను అందించారు. ఇక ఈ కేసు తదుపరి ఎటువంటి మలుపులు తిరుగుతుందో… చూడాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories