AI Overtaking Jobs

ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుంది అని ఆనందించాలో, అదే టెక్నాలజీ ఎన్నో కుటుంబాలకు ఉపాధిని దూరం చేస్తూ రోడ్డు మీదకు తెస్తుంది అని బాధపడాలో అర్ధం కానీ నిశ్చల స్థితిలో ఐటీ ఉద్యోగులు కాలం వెల్లదీస్తున్నారు.

AI డెవలప్మెంట్ తో ఎంతో మంది జీవనోపాధికి దూరమవుతున్న వార్తలు భవిష్యత్ తరాన్ని భయపెడుతున్నాయి. AI రాకతో బఢా పరిశ్రమలన్నీ కూడా తమ ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి.

Also Read – జగన్ భావోద్వేగం నిజమా? లేక అవసరమా?

ఇందులో మైక్రోసాఫ్ట్, గూగుల్, మోటా, అమెజాన్, ఇంటెల్ వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం తమ వేతన వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం తమ కంపనీలోని అనేకమంది ఉద్యోగులను లే ఆఫ్స్ తో వదిలించుకుంటున్నాయి.

ఒక్క మైక్రోసాఫ్ట్ లోనే ఈ ఏడాది దాదాపు సుమారు 9 వేల ఉద్యగలను తొలగించినట్టు గణాంకాలు చెపుతున్నాయి. అలాగే ఇంటెల్ ఈ నెలలో తమ సంస్థలో పనిచేసే సుమారు 20 % మంది సిబ్బందిని తొలగించేందుకు సిద్దమయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read – వైసీపీ PHD లు ఎన్నో ఎన్నెన్నో.?

ఇలా బడా కంపెనీలన్నీ AI రాకతో తమ ఉద్యోగులను తొలగిస్తూ వారి ఉపాధిని హరిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఈ లే ఆఫ్ ట్రెండ్ మీద టెక్కీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇన్నాళ్లు చేతులో లక్షలలో జీతాలు చూసిన సదరు ఉద్యోగులు, హోమ్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్ అంటూ తలకు మించి భారాన్ని మోస్తున్నారు. ఇప్పుడు సడెన్ గా కంపెనీలు తమకు లే ఆఫ్స్ ప్రకటించడంతో ప్రభుత్వాలు తమను ఆదుకోవాలంటూ ఐటీ ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

Also Read – చంద్రబాబు నాయుడు మార్క్ చూపితే చాలు!


ఇన్నాళ్లు తమ జీతాలతో ప్రభుత్వాలకు భారీ మొత్తంలో ఆదాయపన్ను చెల్లించామని, కనీసం తాము ఉపాధికి దూరమైనప్పుడైనా ప్రభుత్వాలు మానవతా కోణంతో తమను ఆదుకోవాలంటూ ఒక ఐటీ ఉద్యోగి సోషల్ మీడియా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనితో ఇంతకీ AI టెక్నాలజీ జీవితాలను మెరుగు చేస్తుందా.? భవిష్యత్ ను బలిపీఠం ఎక్కిస్తుందా.? అన్న సందేహాలు నానాటికి పెరుగుతున్నాయి.