అఖిల్ – శ్రియాలను కలిపేందుకు సిద్ధమైన “మెగా” కాంపౌండ్?

Akhil Shriya bhupal Latest newsఅంతా సవ్యంగా జరిగి ఉంటే… అక్కినేని అఖిల్, ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ ల పెళ్లి మే నెలలో ఇటలీలో ఘనంగా జరిగి ఉండేది. కానీ, వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో… వారి వివాహం రద్దయినట్టు వార్తలు వచ్చాయి. ఈ వివాహం రద్దు కావడంతో అక్కినేని నాగార్జున కూడా చాలా డిస్టర్బ్ అయ్యారట. మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ, ఇరు కుటుంబాలు కూడా ఈ విషయంపై నోరు మెదపడం లేదు.

ఇటీవల కాలంలో పలు ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతున్న అక్కినేని కుటుంబ వర్గీయులను ఈ విషయం గురించి మీడియా ప్రశ్నిస్తున్నప్పటికీ, ఎవరూ ఏ మాత్రం స్పందించడం లేదు. ఒక విధంగా మీడియాను తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తాజాగా మరో వార్త వినిపిస్తోంది. అఖిల్ – శ్రియల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

జీవీ కృష్ణారెడ్డి కుటుంబంతో ఉపాసన కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యం ఉంది. శ్రియకు కూడా ఆమె మంచి స్నేహితురాలు. ఈ క్రమంలో వీరిద్దరినీ కలిపేందుకు ఉపాసన యత్నిస్తోందట. సహజంగా “మెగా” కాంపౌండ్ నుండి ఎవరైనా బరిలోకి దిగారంటే… అది నూటికి నూరు శాతం సక్సెస్ అన్న విధంగానే సినీ వర్గాలు చెప్పుకుంటుంటాయి. మరి మెగా కోడలు ఉపాసన చేస్తోన్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ సాధిస్తాయో వేచిచూడాలి.

ADVERTISEMENT
Latest Stories