అఖిల్ మూవీ నుండి అవుట్ అయిన దర్శకుడు!

Akkineni Akhil - Chandrasekhar Eleti-మంచి అభిరుచి కలిగిన దర్శకులలో చంద్రశేఖర్ యేలేటి ఒకరు. విభిన్నమైన ‘ఐతే’ .. ‘అనుకోకుండా ఒకరోజు’ .. ‘మనమంతా’ వంటి సినిమాలు ఆయన అభిరుచికి అద్దం పడుతుంటాయి. అలాంటి చంద్రశేఖర్ యేలేటి ఈ మధ్య కాలంలో సరైన హిట్ ను అందించలేకపోయాడు. అయినా ఆయనతో ఒక సినిమా చేయడానికి మైత్రీ మూవీస్ వారు ముందుకు వచ్చారు.

సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమా చేసిపెట్టమని వాళ్లు అడిగారట. అయితే అఖిల్ తో చేయడానికే చంద్రశేఖర్ యేలేటి ఆసక్తిని చూపించి, ఆ దిశగానే గట్టి ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే అఖిల్ మాత్రం ‘తొలిప్రేమ’తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరితో సినిమా చేయడానికే ఉత్సాహాన్ని చూపుతున్నాడట. ఈ లోగా సాయిధరమ్ తేజ్… కిషోర్ తిరుమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో ఇటు యేలేటికి ఈ ఛాన్స్ కూడా పోయింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories