ఆర్కే వదిలేసింది రాజకీయమేనా.? కేసులు కాదా.?

Alla Ramakrishna Petitions Rejected in Amaravati Case

మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి 2024 ఎన్నికల ఫలితాల తరువాత స్థానికంగా రాజకీయ అజ్ఞాతంలో ఉన్నారనే చెప్పాలి. సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమితో పాటు మంగళగిరిలో లోకేష్ ఘన విజయం ఆర్కేను మంగళగిరికి దూరం చేసిందా.?

లేదా ఆళ్ళ స్థానంలో వైసీపీ అధినేత వైస్ జగన్ మరొకరికి స్థానం కల్పించడమే ఆర్కేను రాజకీయాల నుంచి దూరం పెట్టిందా.? అన్న చర్చ కూడా స్థానికంగా బలంగా వినిపిస్తుంది. అయితే నాడు వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్ర రాజధాని అమరావతి విధ్వంశం కోసం తనవంతు కృషి అన్నట్టుగా ఆళ్ళ చేసిన రాజకీయం నేడు న్యాయస్థానాల ముందు నిలబడలేకపోతుంది.

ADVERTISEMENT

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో అవకతవకలు అంటూ నాడు ఆర్కే కోర్ట్ కెళ్లారు. అయితే తాజాగా ఆ కేసును సీబీఐ కి అప్పగించాలని, అదే కేసులో సీఎం చంద్రబాబు కి ఇచ్చిన బెయిలు రద్దు చెయ్యాలని, అలాగే ఏసీబీ కోర్ట్ విచారణను ఎంపీ, ఎమ్మెల్యే ల ప్రత్యేక కోర్టుకి బదిలీ చెయ్యాలని ఆర్కే వేసిన మూడు పిటిషన్లను హై కోర్ట్ కొట్టేసింది.

ఆళ్ళ రామకృష్ణ రెడ్డి వేసిన ఈ మూడు పిటిషన్లు విచారణకు అర్హత లేనివని న్యాయస్థానం స్పష్టం చేస్తూ పిటిషన్లను కొట్టేసింది. దీనితో రాజధాని పై ఆర్కే చేస్తున్న కుట్ర ప్రయత్నాలన్నీ కూడా కొట్టుకుపోయినట్టు అయ్యింది. వైసీపీ కి దూరంగా, రాజకీయాలకు అజ్ఞాతంగా ఉంటూ కూడా ఆర్కే కేసుల రూపంలో అమరావతి పై తన విషాన్ని కక్కుతూనే వస్తున్నారు, అలాగే సీఎం చంద్రబాబు మీద తన రాజకియ అక్కసును వెళ్లబోస్తూనే ఉంటున్నారు.

ఆర్కే వైసీపీ పార్టీ కి దూరమైనప్పటికి రాజధాని విషయంలో ఇంకా వైసీపీ భావజాలంతోనే పనిచేస్తున్నారా.? రాజకీయ అజ్ఞాతం లో ఉంటున్నా కేసుల విషయంలో ఇప్పటికి బాబు ని వెంటాడడానికే మొగ్గు చూపిస్తున్నారా.? ఇక ఇప్పటికైనా హై కోర్ట్ తీర్పుతో ఆళ్ళ న్యాయపోరాటాల పేరుతో చేస్తున్న ఈ రాజకీయానికి స్వస్తి పలుకుతారా లేదా.?

ADVERTISEMENT
Latest Stories