వైసీపీ నేతలకు కోర్ట్ కెళ్ళడం అంటే పార్టీ కార్యాలయానికి వెళ్లినంత సులువుగా మారిపోయింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రత్యర్థి పార్టీలను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి, వారి మీద బురద జల్లడానికి న్యాయస్థానాలను ఒక ఆయుధాలుగా వాడుకుంటున్నారు వైసీపీ నేతలు.
రాజధాని పై నిర్ణయం తీసుకోవాలన్నా కోర్టులే, సినిమా టికెట్లు పెంచాలి, తగ్గించాలి అన్నా కూడా కోర్టులే, మాజీ ముఖ్యమంత్రి దేశం వీడాలన్న, దేశంలో తిరగాలన్నా కూడా కోర్టుల నిర్ణయం శిరోధార్యం అన్నట్లుగా వైసీపీ నేతలు నడుచుకోవాల్సిందే. అటువంటి న్యాయస్థానాల నుండి గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో మొట్టికాయలు బహుమతిగా అందుకుంది.
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ పార్టీ రంగుల నుంచి, విశాఖ కు రాజధానిని తరలించడం వరకు వైసీపీ సర్కార్ తీసుకున్న అన్ని నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుబట్టాయి. ఆ నిర్ణయాల అమలుకు అడ్డుగోడల నిలిచింది ఏపీ ధర్మాసనం. ఇక జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఏపీ రాజధాని అమరావతి మీద విషం జిమ్మడానికి తెలంగాణ రాజకీయాలను ఏపీ రాజకీయాలతో ముడి చేసి చంద్రబాబు మీద కోర్ట్ కెళ్లారు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి.
ఓటుకు నోటు కేసులో బాబు పాత్ర పై సిబిఐ విచారణ కోరుతూ సుప్రీం కోర్ట్ తలుపు తట్టిన ఈ కరకట్ట కమలహాసన్ కు నేడు సుప్రీం ధర్మాసనం మరోసారి మొట్టికాయ వేసింది. ఆర్కే వేసిన ఈ కేసును కోర్ట్ కేట్టివేస్తూ రాజకీయ కక్ష్య సాధింపులకు న్యాయస్థానాలను వేదిక చేసుకోవద్దని జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆళ్ళ ను మందలించింది.
దీనితో వైసీపీ నేతలకు న్యాయమూర్తుల నుండి మందలింపులు, న్యాయస్థానాల నుండి మొట్టికాయలు కొత్తేమి కాదులే అంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు టీడీపీ శ్రేణులు. ఇటువంటి ఎన్ని అవమానాలు కోర్టుల నుండి ఎదురైనా వైసీపీ నేతలకు కూసంత సిగ్గు కాసంత బిడియం కూడా ఉండవనేది వాస్తవం అంటూ సంబరాలు చేసుకుంటున్నారు టీడీపీ మద్దతుదారులు.
అక్రమంగా, అన్యాయంగా బాబు పై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులు కూడా ఇదేవిధంగా కొట్టేసే రోజు త్వరలోనే వస్తుంది, వాటిని చూడడానికి, ఆ తీర్పులు వినడానికి వైసీపీ నేతలు ‘సిద్ధమా’ అంటున్నారు టీడీపీ తమ్ముళ్లు.




