ఎట్టకేలకు శ్రీతేజ్ ను కలిసిన అల్లు ఫ్యామిలీ

Allu Family Meets Sritej

“పుష్ప 2” సినిమా ప్రీమియర్ షో టైంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తల్లిని కోల్పోయి గత ఏడాదిన్నరకాలంగా మంచానికి పరిమితమైన శ్రీతేజ్ గురించి మెల్లమెల్లగా జనాలు మర్చిపోతూ వస్తున్నారు. ఈ కేస్ విషయంలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం పెద్ద హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బన్నీ అదే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో గద్దర్ అవార్డ్ అందుకున్నాడు అనుకోండి.

అయితే.. బన్నీ వాసు, ఎస్కేయన్, అల్లు అరవింద్ మినహా శ్రీతేజ్ ను పలకరించడానికి అల్లు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఆసక్తి చూపలేదు. మరీ ముఖ్యంగా.. అల్లు అర్జున్ ఇప్పటివరకు శ్రీతేజ్ ను కలవకపోవడం అనేది చాలామంది వేలెత్తి చూపిన విషయం.

ADVERTISEMENT

మరి ఏమనుకున్నారో ఏమో కానీ.. ఇవాళ సడన్ గా అల్లు స్నేహ రెడ్డి మరియు అల్లు అరవింద్ లు కలిసి శ్రీతేజ్ వాళ్ళ ఇంటికి వెళ్లి.. శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వాకబు చేయడమే కాక, వాళ్ల కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయం గడిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎంత డబ్బులు ప్రకటించినా, ఎంత ట్రస్ట్ స్థాపించినా, అల్లు అర్జున్ కూడా ఒకసారి శ్రీతేజ్ ను ఒకసారి పర్సనల్ గా కలిసి, అతడి తండ్రితో కాసేపు ముచ్చటిస్తే బాగుంటుంది. అప్పుడు బన్నీ మీద ఈ సంధ్య థియేటర్ ఘటన విషయంలో ఉన్న నెగిటివిటీ కూడా కొంచం తగ్గే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories