అమరావతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాబు చేయాల్సిందంతా చేస్తున్నారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ వనవాసం నుంచి విముక్తి పొందిన అమరావతి కి కూటమి ప్రభుత్వ హయాంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదగా తిరిగి పట్టాభిషేకం చేసారు సీఎం బాబు.
అలాగే నాడు వైసీపీ నిర్లక్ష్యంతో అరణ్యంగా మారిన అమరావతి నేడు బాబు ప్రోత్సాహంతో అభివృద్ధిలో దూసుకుపోతుంది. నాడు అమరావతిని ఒక స్మశానం అంటూ హేళన చేసిన వైసీపీ కళ్ళ ముందే నేడు అమరావతిలో పలు సంస్థల శంకుస్థాపనలు జరిగేలా చేస్తున్నారు బాబు.
ఇక నాడు వరద ప్రాంతం అంటూ నిర్మాణాలకు అనువైన ప్రదేశం కాదు అంటూ విష ప్రచారం చేసిన వైసీపీ నోటితోనే నేడు క్వాంటం కంప్యూటింగ్ నిర్మాణ పనుల గురించి ప్రచారం చేసేలా చేస్తున్నారు.
అలాగే వైసీపీ హయాంలో అదే అమరావతి సాక్షిగా అసెంబ్లీలో మూడు రాజధానుల తీర్మానం చేసిన చోటే నేడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతే అనేలా బాబు ప్రభుత్వం తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పార్లమెంట్ లో బిల్లు రూపంలో ప్రవేశపెట్టింది.
ఆ బిల్లుతో రాజధానికి చట్ట భద్రతా కల్పించేలా చేసారు. ఇలా బాబు తన ప్రయత్న లోపం లేకుండా, చిత్తశుద్దిగా రాష్ట్ర రాజధాని గా అమరావతి ని నిలబెట్టేందుకు తన శక్తివంచన లేకుండా తనకు మించిన శ్రమే చేస్తున్నారు, అలాగే అందుకు అనుగుణంగానే ఫలితాలను రాబడుతున్నారు.
నాడు తెలంగాణకు హైదరాబాద్ మాదిరి నేడు ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దాలని, రేపటి భావితరం భవిష్యత్ కి సొంత రాష్ట్రంలోనే మెరుగైన విద్య, వైద్యంతో పాటుగా బలమైన ఉపాధి అవకాశాలు అందించే దిశగా ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్, బిట్స్ బిలాని, విట్, ఎస్ఆర్ఎం, డేటా సెంటర్, TCS, కాగ్నిజెంట్ పేర్లతో బాబు పేరుస్తున్న ఒక్కో ఇటుక రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాజధాని అమరావతి ఒక అక్షయ పాత్ర కానుంది.
అలాగే వైసీపీ అనే రాజకీయ మహమ్మారి నుండి అమరావతిని రక్షించేందుకు, ఆ పార్టీ ఆడే మూడు రాజధానుల చదరంగం నుండి రాష్ట్రాన్ని, రాజధాని అమరావతిని కాపాడేందుకు తనవంతు కృషిలో భాగంగా పార్లమెంట్ సాక్షిగా చట్టం చేసి ఆ చట్టం తో రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నారు.
ఇక ఏపీ భవిష్యత్, అమరావతి అభివృద్ధి అనేది ప్రజల చేతిలోనే ఉంది. సంక్షేమం – అభివృద్ధి తో పరుగులు పెట్టే రాష్ట్ర భవిష్యత్ కావాలా.? లేదా చట్టసవరణలతో చిక్కుముడులు పెట్టే జగన్ కావాలా.? రాజధాని గా అమరావతి కావాలా.? లేదా ప్రజావేదికల కూల్చివేతగా వైసీపీ కావాలా.? అనేది తేల్చుకోవాల్సింది AP ప్రజానీకమే.




