అమరావతిలో అగ్నిప్రమాదాలు యాధృచ్చికమేనా?

Amaravati Fires: SIT Probe Ordered Over Suspicion

నిర్మాణ ప్రదేశాలలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 11న ఎల్ & టి కంపెనీ సైట్ వద్ద, మళ్ళీ ఈ నెల 23న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ సైట్ వద్ద అగ్నిప్రమాదాలు జరిగాయి.

అవి ప్రమాదవశాత్తు జరిగినవే అయితే మళ్ళీ అటువంటి పొరపాట్లు, ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ అమరావతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారు, నిర్మాణ పనులు అడ్డుకునేందుకు ఇలాంటి కుట్రలు చేస్తే? అనే ఆలోచన ప్రభుత్వాన్ని సిట్‌ ఏర్పాటు చేసేలా చేసింది.

ADVERTISEMENT

గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో ఒక డీఎస్పీ, నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలను కేటాయించింది. వారు ఈ రెండు అగ్నిప్రమాదలపై లోతుగా విచారణ జరిపి అవి యాదృచ్చికంగా జరిగినవేనా లేదా ఎవరైనా కుట్రపూరితంగా ఈ అగ్నిప్రమాదాలు చేశారా?అనే కోణంలో విచారణ జరుపనున్నారు.

కనుక గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు సిట్‌ ఏర్పాటు, విచారణపై ఎవరూ అభ్యంతరం చెప్పారనే ఆశిద్దాం. చెప్తేనే అసలు కథ మొదలవుతుంది.

ADVERTISEMENT
Latest Stories