chandrababu-naidu-nirmala-sitharaman-amaravati

మూడు రాజధానుల పేరుతో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా పేర్చని జగన్, బటన్ లు నొక్కాను కానీ ఓట్లు పడలేదే అంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!

రాష్ట్ర రాజధానికి కుల ముద్ర వేసి, అదొక ముంపు ప్రాంతమంటూ అసత్య ప్రచారం చేసి, రాజధానిని సమాధి చేసిన ఏకైక సీఎం గా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. అయితే గత ఐదేళ్లు వైసీపీ నిర్లక్ష్యం తో అరణ్యవాసం చేసిన అమరావతి కూటమి రాక తో పట్టాభిషేకానికి సిద్దమయ్యింది.

ఇందులో భాగంగా అమరావతి పునర్నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ముందుగా జంగల్ క్లియరెన్స్ తో అమరావతికి పూర్వ వైభవం తీసుకువచ్చారు ముఖ్యమంత్రి బాబు. అలాగే రానున్న నాలుగేళ్లలో అమరావతికి రాజధానిగా ఒక నిర్దిష్ట రూపాన్నిచ్చి రాష్ట్రాన్ని తిరిగి గాడినపెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను పుష్కలంగా వినియోగించుకుంటున్నారు.

Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?

ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణాల పునరుద్దరణకు కేంద్రం తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ నిధుల వేట మొదలుపెట్టారు. అందుకుగాను నేడు కేంద్రం అమరావతి పునర్నిర్మాణం కోసం సుమారు 4200 కోట్లు నిధులు విడుదల చేసింది. అయితే గత ఐదేళ్లు అమరావతి నిర్మాణానికి కానీ జగన్ భావించినట్టు విశాఖ అభివృద్ధికి కానీ ఒక్క రూపాయి నిధులు వెచ్చించని వైసీపీ ఇప్పుడు ఈ స్థాయిలో రాజధానికి నిధులు అంటే సహించగలదా.?

అయితే ఇటీవలే తొలి విడతలో భాగంగా ప్రపంచ బ్యాంకు నుంచి 3535 కోట్లు విడుదల చేయగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా భారీగా నిధులు చేకూరడంతో ఇక రాజధాని అమరావతి పునర్నిర్మాణం మరింత వేగవంతం కానుంది. కూటమి ప్రభుత్వం యొక్క ఐదేళ్ల కాలపరిమితిలోనే ఈ నిర్మాణాలను పూర్తి చేసి రాష్ట్ర అభివృద్ధి పై తమకున్న నిబద్ధతను రుజువు చేసుకోవాలని బాబు గట్టి పట్టుదలగా ఉన్నారు.

Also Read – HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్‌ప్రైజ్!

ఇందుకు గాను అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి, ఇన్నర్ రింగ్ రోడ్ల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించారు. అలాగే అమరావతిలో నిర్మించబోయే మరిన్ని ప్రభుత్వ భవనాల శంకుస్థాపన కూడా ప్రధాని మోడీ చేతుల మీదగా నిర్వహించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసారు బాబు.

తెలంగాణ బ్రాండ్ గా ప్రపంచ దేశాలలో గుర్తింపు, గౌరవం పొందుతున్న హైద్రాబాద్ అభివృద్ధికి పునాది వేసి 2020 అంటూ ఆయన మార్క్ విజనరీని ఆనాడే ప్రపంచానికి పరిచయం చేసారు బాబు. ఇప్పుడు కూడా అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వాల్యూ ను అమరావతి తో మరోమెట్టు ఎక్కించాలని 2040 అంటూ తన విజనరికి మరింత పదును పెడుతున్నారు.ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో బాబు పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని టీడీపీ ఆశ పడుతుంది.




అయితే గత ఐదేళ్ళు అమరావతి మీద నిత్యం విషం చిమ్ముతూ విష సర్పం మాదిరి తన సొంత రాష్ట్రాన్ని తానే వినాశనం దిశగా నడిపించారు జగన్. తన అసత్య ప్రచారాలతో, మూడు ముక్కలాటతో ప్రాణం తీసిన నగరానికి నేడు నిధుల సేకరణతో, నిర్మాణాల పునరుద్ధరణతో ఉపిరిపోస్తున్నారు బాబు. అయితే అంతటి విధ్వంసాన్ని కాంక్షించిన వైసీపీ కళ్ళకు ఇంతటి అభివృద్ధిని చూస్తే ఇక వారికి రక్త కన్నిరేనేమో సుమీ..!