అభివృద్ధి పనులపై కూడా దుష్ప్రచారమేనా?

Amaravati capital city construction works progressing rapidly in Andhra Pradesh

రాజకీయాలలో ఉన్నత శిఖరాలు, రాజకీయాలలో అధఃపాతాళానికి… అనే మాట తరచూ వింటుంటాం. పార్టీలు, నాయకుల గెలుపోటముల గురించి చెప్పుకునేందుకు ఉపయోగిస్తారు. కానీ నకిలీ ఫోటోలు, నకిలీ వీడియోలు, అబద్దపు వార్తలతో దుష్ప్రచారం, ఫేక్ ప్రచారాలు చేయడాన్ని ఏవిధంగా వర్ణించాలి? నిత్యం ఇలాంటి తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రజల వాటినే నమ్మే ప్రమాదం ఉంటుంది. కనుక కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు దీనిని గమనిస్తూ, ఖండించడం కూడా తప్పనిసరిగా మారింది.

తాజాగా మంగళగిరి సమీపంలో ఎయిమ్స్ దగ్గర అక్రమార్కులు కొండని తవ్వేస్తూ పర్యావరణ విధ్వసం చేస్తుంటే, పర్యావరణ శాఖ మొద్దు నిద్రపోతోందంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఫోటో పెట్టారు.

ADVERTISEMENT

మరి ఇలాంటి వ్యక్తులు నాడు జగన్‌ హయంలో విశాఖలో పచ్చటి చెట్లతో నిండిన రుషికొండని తవ్వేసి పెద్ద మట్టిదిబ్బగా మార్చేసినప్పుడు స్పందించరా?ప్రజలను మభ్యపెట్టేందుకు ఆ మట్టి దిబ్బపై పచ్చటి గ్రీన్ మ్యాట్ పరిచినప్పుడు నోరెత్తగలిగారా? అంటే లేదనే చెప్పాలి.

అప్పుడు నోరెత్తకపోవడానికి, ఇప్పుడు ప్రశ్నిస్తుండటానికి కారణం అందరికీ తెలుసు. కనుక ఇప్పుడా రాజకీయాల గురించి చర్చ అనవసరం.

సోషల్ మీడియాలో జరిగుతున్న ఈ దుష్ప్రచారానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ‘ఫ్యాక్ట్ చెక్’ వ్యవస్థ ధీటుగా స్పందించింది. దాని వివరణ చూసినప్పుడు ఒక మంచి పని లేదా అభివృద్ధి పని జరుగుతున్నప్పుడు కూడా సోషల్ మీడియాలో దానిని ఎలా వక్రీకరించి దుష్ప్రచారం చేస్తారో అర్ధమవుతుంది.

ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ ఇన్‌ ఏమి చెప్పిందో దాని మాటల్లోనే…

మంగళగిరి ఎయిమ్స్ (AIIMS) సమీపంలో పర్యావరణ శాఖ కళ్ళుకప్పి కొండలను అక్రమంగా తవ్వేస్తూ, ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.

చిత్రాల్లో కనిపిస్తున్న పనులు అక్రమ తవ్వకాలు కావు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని, మంగళగిరి జాతీయ రహదారిని అనుసంధానించే అత్యంత ప్రతిష్టాత్మకమైన E13 రోడ్డు నిర్మాణ పనులు.

మంగళగిరి ఎయిమ్స్ మీదుగా అమరావతి కోర్ క్యాపిటల్‌కు వెళ్లే ఈ బృహత్తర రహదారి మార్గంలో కొండ భాగం అడ్డుగా ఉంది.

ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడానికి ప్రభుత్వం అధికారికంగా ‘హిల్ కట్టింగ్’ పనులను చేపట్టింది.

అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల పర్యావరణ మరియు అధికారిక అనుమతులు ఉన్నాయి. నిబంధనల ప్రకారమే ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

రాజధాని అమరావతి కనెక్టివిటీ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న E13 రహదారి అభివృద్ధి పనులను, సోషల్ మీడియాలో కొందరు “అక్రమ కొండల తవ్వకం, ప్రకృతి విధ్వంసం” అంటూ తప్పుడు రంగు పులిమి తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి ఈ ప్రచారాన్ని నమ్మవద్దు. #FactCheck #AndhraPradesh

ADVERTISEMENT
Latest Stories