రెచ్చగోడితే దాడులేనా! ఇవి వైసీపీ కి కొత్త కాదుగా?

Ambati-Rambabu-AP-Assemblyచంద్రబాబు అరెస్ట్ రచ్చ రోడ్లను వదిలి ఇక అసెంబ్లీని తాకింది. మీడియా ముందు తమ స్వామి భక్తి చాటుకోవడానికి ఒకరి పై ఒకరు పోటీ పడి మరి ప్రతిపక్ష నేతలను కించపరచడం,అవహేళన చేయడం మరీ ముఖ్యంగా రెచ్చగొట్టే ధోరణిలో తమ స్క్రిప్ట్ పేపర్లను సిద్ధం చేయించడం వైసీపీ నేతలకు “వెన్నతో పెట్టిన విద్య” మాదిరే.

అయితే ఒక్కొక్కరుగా ఉంటేనే ఇంత రచ్చ చేసే వైసీపీ నాయకులు ఇప్పుడు అందరు ఒకేచోట అసెంబ్లీ లో చేరితే అక్కడ పరిస్థితిలు మన ఊహకు మించి ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని అంబటి నిరూపించే పనిలో ఉన్నారు. రెచ్చగోడితే రచ్చ లేపుతామంటూ అధికార పార్టీ సభ్యులే రెచ్చిపోతే ఇంక రాష్ట్ర సమస్యల సంగతేంటి.

ADVERTISEMENT

ఏ పార్టీ నేతలైనా తమ అధినేత పట్ల ప్రభుత్వం చేస్తున్న కుట్ర పూరిత ఆరోపణల పై నిరసన తెలపడం వారి బాధ్యతగా భావిస్తారు. ఒక రకంగా అది వారి సామాజిక హక్కు కూడా అవుతుంది. నిరసనలు చేస్తేనే రెచ్చ గొడుతున్నారని వైసీపీ నేత అంబటి వ్యాఖ్యానించడం వారి పార్టీ మానసిక వైకల్యానికి అద్దం పడుతుంది. గత టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ అధినేత జగన్ స్వయంగా ముఖ్యమంత్రినే ఉరితీయండి, చీపుర్లతో కొట్టండి అంటూ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమో?

అసెంబ్లీ వేదికగా వైసీపీ నేతలు రోజా.., నాని చేసిన వికృత చేష్టలు ఆదర్శనీయమైనవా? అంబటి గారు! గతంలో ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలకు కొత్త అర్థాలను వెతికి మరీ తమ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వైసీపీ బ్యాచ్ టీడీపీ కేంద్ర కార్యాలయం పై చేసిన దాడి, అక్కడి టీడీపీ కార్యకర్తలను విచక్షణ రహితంగా కొట్టిన తీరు ఇప్పటికి కళ్ళముందు కదలాడుతూనే ఉంది.

స్వయానా ముఖ్యమంత్రి వర్యులే మా పార్టీ నేతలకు బీపీలు వచ్చాయి రెచ్చిపోయారు అంటూ అటువంటి అసాంఘిక శక్తులను వెనకేసుకొచ్చిన తీరు అందరిలో ఆశ్చర్యాన్ని – ఆలోచనను కలిగించింది. అర్హత లేని వ్యక్తికీ అధికారం అప్పగిస్తే వచ్చే పరిణామాల తాలూకా ఫలితాలివే. ఎవరో రెచ్చగోడితే మేము రెచ్చిపోతాం అంటూ స్వీయ నియంత్రణ తెలియని నేతలు అధికారంలోకి వస్తే వారిని నియంత్రించడానికి ప్రజలకు ఐదు సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్ ను తాకట్టు పెట్టాల్సిందే.

ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే ప్రతిపక్ష నేతలు వారిని రెచ్చ గొడుతున్నారనే అనుకున్న 23 మంది విపక్ష సభ్యులనే అదుపుచేయలేని ప్రభుత్వ పెద్దలు ఇక రాష్ట్రాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. దమ్ముంటే రా! చూసుకుందాం! టీడీపీ సభ్యులు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు.. ఆ తరువాత జరిగే అసంఘటిత చర్యలకు మేము బాధ్యులం కాము అంటూ అసెంబ్లీ సాక్షిగా అంబటి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ డొల్ల తనాన్ని తేలియచేస్తుంది .

రాష్ట్ర అసెంబ్లీని అసాంఘిక చర్యలకు అడ్డాగా మార్చాలన్నదే వైసీపీ భావనా? అసంఘటిత కార్యక్రమాలకు అసెంబ్లీని వేదికగా చేసుకున్నారా? అన్నట్లు సదరు మంత్రివర్యలు తను ఒక అధికార పదవిలో ఉన్నాను…, రాష్ట్ర ప్రజలకు జవాబుదారిగా ఉండాలి అనే కనీస సృహ కూడా లేకుండా ప్రవర్తించిన తీరు, కొన్ని కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రజలను రెచ్చగొడుతుంది అని గుర్తుంచుకోవాలి.

రాష్ట్రాన్ని పాలించేవాడే ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారంటే తమ ఓటు ఏపాటి విధ్వంశానికి దారి తీసిందో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలంటూ ప్రజాస్వామ్యవాదులు హితవు పలుకుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories