ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వాల్యూ ని ప్రమోట్ చేయడంలో టీడీపీ పార్టీ ఒకదారిని ఎంచుకుంటే వైసీపీ మరోదారిలో ముందుకెళ్తుంది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం తన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే విధానం తన విజనరికి అద్దం పడుతుంటే, వైస్ జగన్ ప్రమోషన్స్ ఆయన ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ కు నిదర్శనంగా నిలుస్తుంది.
స్వర్ణాంధ్రప్రదేశ్…సన్ రైజ్ స్టేట్…దేవతల రాజధాని అమరావతి, కలిగియుగ దైవం కొలువున్న తిరుమల వెంకన్న, సింహచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న, బెజవాడ దుర్గమ్మ, సముద్రపు హోయలతో ఉప్పెంగే విశాఖ, మినీ ఊటీగా పిలుచుకునే అరకు,
గోదావరి రుచులు, ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి చేనేత, అరకు కాఫీ, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక కళాకృతులు…ఇలా ఏపీలో కొలువుతీరిన ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల నుంచి ఆయా ప్రాంతాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వస్తువుల వరకు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ కోసం వినియోస్తున్నారు.
ఇందులో భాగంగానే అరకు వంటి గిరిజన ప్రాంతాలలో లభించే కాఫీ గింజలను ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీ పేరుతో ప్రమోట్ చేస్తున్నారు బాబు. అరకు వంటి మారుమూల గిరిజన ప్రాంతంలో దొరికే ఈ కాఫీ రుచులను బాబు తన ప్రమోషన్ తో ఏకంగా దేశ పార్లమెంట్ క్యాంటీన్ వరకు తీసుకెళ్లారు.
అలాగే అటు ప్రపంచ వ్యాప్తంగా ఈ అరకు కాఫీ ఎగుమతులను పెంచేలా చర్యలు చేపడుతున్నారు. ఇక తండ్రికి తగ్గ తనయుడు మాదిరి నారా లోకేష్ సైతం తన నియోజకవర్గంలో ఉన్న మంగళగిరి చేనేత పరిశ్రమను ప్రోత్సహిస్తూ, అక్కడ తయారయ్యే మంగళగిరి వస్త్రాలను సందర్భం చిక్కినప్పుడల్లా ఇది రాష్ట్రంలో ఉన్న ఒక అద్భుతమైన కళ కు నిదర్శనం అంటూ ప్రమోట్ చేస్తున్నారు.
ఈ విధంగా టీడీపీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వాల్యూ ని ప్రమోట్ చేస్తూ పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తూ రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుంటే, వైసీపీ తన ప్రమోషన్స్ తో రాష్ట్ర స్థాయిని పాతాళానికి దిగజారుస్తుంది.
రాజకీయాలకు బూతులను పరిచయం చేయడం, ప్రజాస్వామ్యంలో దాడులను ప్రోత్సహించడం, వ్యక్తిగత విమర్శలతో హద్దులు దాటడం, రప్పా రప్పా అంటూ హింసను ప్రోత్సహించడం, ఆడవారిని అవమానించడం,
కక్ష్య రాజకీయాలకు తెరలేపడం, హత్యా రాజకీయాలతో భయపెట్టడం, రాజధానులను మార్చడం,కోడికత్తి, గులకరాయి అంటూ హడావుడి చేయడం ….వంటి చర్యలతో ఏపీ బ్రాండ్ వాల్యూ ని జగన్ ఏ స్థాయికి దిగజార్చారు అంటే పారిశ్రామిక వేత్తలు ఏపీ సరిహద్దులు దాటిపోయే పరిస్థితులను తీసుకొచ్చారు.
ఆ భయం ఎంతలా వారిని ప్రభావితం చేసిందంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా భవిష్యత్ లో వైసీపీ అధికారంలోకి వస్తే అన్న ప్రశ్నే ఇప్పటికి పారిశ్రామిక వేత్తలను స్వేచ్ఛగా ముందడుగు వేయనీయడం లేదు.
సన్ రైజ్ స్టేట్ అంటూ బాబు ప్రచారం చేస్తుంటే సన్ సెట్ స్టేట్ అంటూ వైసీపీ ప్రమోట్ చేస్తుంది. బాబు అరకు కాఫీ అంటే జగన్ రప్ప రప్ప గొడ్డలి అంటున్నారు, టీడీపీ మంగళగిరి చేనేత అంటుంటే వైసీపీ మహిళల పై అసభ్యకర వ్యాఖ్యలతో రెచ్చిపోతుంది,
అమరావతి దేవత రాజధానిగా టీడీపీ ప్రమోట్ చేస్తుంటే, అమరావతి వేశ్యల నగరమంటూ వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇలా ఏపీ బ్రాండ్ వాల్యూ ను పెంచేందుకు ఒకరు తన విజనరీతో ముందుకు వెళ్తుంటే, ఏపీ బ్రాండ్ వాల్యూ ని తుంచేందుకు మరొకరు తన విద్వేషంతో అడుగులేస్తున్నారు.






