వైసీపీ హయంలో విశాఖలో జరిగిన సదస్సులో రాష్ట్రానికి సుమారు రూ.13.50 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని వాటితో ఏర్పాటుకాబోయే పరిశ్రమలలో సుమారు 6 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ గొప్పలు చెప్పారు.
కానీ ఆ తర్వాత మళ్ళీ ఎన్నడూ వాటి గురించి మాట్లాడలేదు. ఆ లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు అయ్యాయో ఎవరికీ తెలీదు.
తమ ప్రభుత్వ అరాచక పాలన చూసి అందరూ భయపడి పారిపోతుంటే అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేశాయంటే ఎవరైనా నమ్ముతారా?అని ఆలోచించకుండా ఆ సదస్సుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు.
కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు తరలివస్తున్నాయి… అని సిఎం చంద్రబాబు నాయుడు చెపుతున్నవి ‘గుడ్డు మంత్రి చెప్పిన కాకమ్మ కధలు వంటివి కావు. ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయో, అవి ఏ దశలో ఉన్నాయో ఫోటోలతో సహా పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఆరు నెలల్లో కాకినాడ జిల్లాలో 300, తూర్పు గోదావరి జిల్లాలో 307, కోనసీమ జిల్లాలో 91 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడంతో వాటి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.
వీటిలో క్యూలే, దివీస్ కంపెనీలు ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తిచేసుకొని ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నాయి. రిలయన్స్ బయో ఎనర్జీ మొదటి యూనిట్ ఫిబ్రవరి నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది. మిగిలిన రెండు యూనిట్లు డిసెంబర్‌లోగా ప్రారంభం అవుతాయి. జగ్గంపేటలో ఏర్పాటు అవుతున్న కంపెనీలో తొలిదశలో 250 పవర్ లూమ్ యంత్రాలను అమర్చుతున్నారు. ఒకటి రెండు నెలల్లో అవి ఉత్పత్తి ప్రారంభిస్తాయి. ఆ తర్వాత డిసెంబర్‌లోగా మరో 500 యంత్రాలు ఏర్పాటు చేయబోతోంది. రాయవరం మండలం మాచావరంలో పప్పు దినుసుల ప్రాసెసింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ క్లస్టర్. అలాగే కొబ్బరిపీచుతో పరుపులు వగైరా ఉత్పత్తులు తయారుచేసేందుకు పాశర్లపూడిలో కాయర్ క్లస్టర్ ఏర్పాటు చేసింది. ఈ రెండు క్లస్టర్లలో అనేక చిన్న, మద్య తరహా కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయి.





