
ఏపీ మెట్రో: విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులకు గతంలో అంటే 2014-19 మద్య ఇచ్చిన ప్రతిపాదనల స్థానంలో మళ్ళీ డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్), మొబిలిటీ ప్లాన్‌తో ప్రతిపాదనలు పంపించమని కేంద్రం సూచించిన్నట్లు తెలుస్తోంది.
అంటే మెట్రో ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్రం ఈవిదంగా సానుకూలంగా సూచించడం శుభపరిణామమే.
Also Read – గంట అరగంట వీరులకు అర్దమైంది కానీ దువ్వాడకు అర్ధం కాలే.. అందుకే..
కేంద్రం సూచన మేరకు ఏపీ మెట్రో కార్పొరేషన్ మొబిలిటీ ప్లాన్ రూపొందించేందుకు కన్సల్టన్సీ ఓ సంస్థని ఖరారు చేసినట్లు సమాచారం.
అమరావతి: ఇక రాజధాని అమరావతిలో హైకోర్టు, శాసనసభ భవన నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలువగా ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎల్&టి, ఎన్‌సీసీ టెండర్లు వేశాయి. త్వరలో ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచి ఎల్-1గా నిలిచే సంస్థకు వీటి నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తుంది.
Also Read – పవన్ పై కేటీఆర్ వ్యాఖ్యలు…!
అమరావతిలో ఇప్పటికే అమృత, ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీలలో అప్పుడే కోర్సులు ప్రారంభించగా వాటిలో చేరిన కొన్ని బ్యాచ్‌లు సర్టిఫికెట్స్ అందుకొని బయటకు వెళ్ళాయి కూడా. టీటీడీకి కేటాయించివన 25 ఎకరాలలో ఇప్పటికే ఆలయ నిర్మాణం పూర్తయింది.
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో 11 ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు నెలరోజులు గడువు ఇచ్చింది. వాటిలో విదేశాంగ శాఖ (కార్యాలయం), వరుణ్ హాస్పిటాలిటీ, ప్రైవేట్ లిమిటెడ్, సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థలున్నాయి. నెలరోజులలోగా సీఆర్‌డీఏతో ఒప్పందం చేసుకొన్నట్లయితే గతంలో వాటికి అమ్మకం లేదా దీర్ఘకాలిక లీజు కింద 29 ఎకరాల భూకేటాయింపులను రద్దు చేస్తామని తెలియజేసింది.
Also Read – జమ్ము కశ్మీర్‌కి ప్రజా ప్రభుత్వాలు పనికిరావేమో?
ఆంధ్ర బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, శాప్ నెట్, బీఆర్‌ఎస్ మెడీసీటీ తదితర సంస్థలకు 2027 వరకు గడువు పొడిగించింది. వీటితో పాటు బ్రహ్మకుమారీస్ ఎడ్యుకేషన్ సొసైటీ, నందమూరి బసవతారకం రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ వంటి ప్రముఖ సంస్థలకు గడువు పొడిగించింది.
ఇవికాక రాష్ట్ర వ్యాప్తంగా వివిద జిల్లాలలో ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేసిన పరిశ్రమలు, సంస్థల నిర్మాణ పనులకు చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి.
నిన్ననే కృష్ణాజిల్లాలో అశోక్ లే ల్యాండ్ కంపెనీకి మంత్రి నారా లోకేష్ ప్రారంభోత్సవం చేయగా నేటి నుంచి ఉత్పత్తి ప్రారంభం అయ్యింది.
ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలలోనే ఇన్ని అభివృద్ధి పనులకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతుండటం గమనిస్తే, గత 5 ఏళ్ళ జగన్ విధ్వంస పాలనలో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కోలుకోగలదనే నమ్మకం కలుగుతోంది.