పదవులుంటే….ప్రజలతో పని లేదా..? నిజం ఒప్పుకున్న మంత్రి..!

Anil-Kumar-Yadav YSRCP MLAమంత్రి పదవులుంటే ప్రజలతో పనిలేదంతున్నారు ఓ మాజీ మంత్రి. ఇప్పటి వరకు మంత్రులుగా ఉండడం వలన ప్రజలతో మమేకమయ్యే అవకాశం లేకపోయింది. ఇప్పుడు మంత్రి పదవులకు జగన్ ‘హాలిడే’ ప్రకటించారు కాబట్టి మేము మాజీలు అయ్యాం. ఇకనుండి మా నియోజక వర్గ ప్రజలను కలిసి జగన్ ప్రభుత్వానికి మరింత బలం చేకూర్చుతాం అంటూ మాజీ నీటి పారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనమనసులో మాట బయటపెట్టారు.

మంత్రి పదవులు ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి అడ్డంకులుగా మారుతున్నాయని మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పకనే చెప్పారు. పదవులున్నంత కాలం గుర్తురాని నియోజకవర్గం సమస్యలు మాజీలుగా మారగానే తెలిసొచ్చాయా అంటూ ప్రతిపక్ష పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి.అది కూడా ప్రజల కోసం కాదు జగన్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి అంటూ అంత నిస్సుగ్గుగా చెప్పడం వైసీపీ నాయకులకే చెల్లింది అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

ADVERTISEMENT

జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పదవి రాగానే ప్రజలకు మొహం చాటేశారంటూ విమర్శిస్తున్నాయి విపక్ష పార్టీలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘యాత్రల’ పేరుతో నిత్యం ప్రజల మధ్యే ఉన్న జగన్ అధికారంలోకి రాగానే తన తాడేపల్లి ప్యాలస్ వదిలి రాలేకపోయారని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి.

పదవి అనేది రాజకీయ నాయకుడికి ఒక ‘బాధ్యత’ కావాలే కానీ ‘బరువు’ కాకూడదు.పదవులు ‘ప్రజల అవసరాల’ కోసమే కానీ ‘ప్రతినిధుల అలంకారానికి’ కాదనేది వాస్తవం. ఒక సమర్ధతకు దక్కిన హక్కు గానే పదవులను భావించాలే తప్ప సమస్యలను సృష్టించడానికి మార్గాలుగా వాటిని వాడకూడదు. కానీ నేటి రాజకీయాలలో సమర్ధతకు దక్కాల్సిన గౌరవం మరి దేనికో తక్కుతుందనే భావన సామజిక వేత్తలలో కనపడుతుంది.

డబ్బుతో ., రౌడీయిజంతో., బెదిరింపులతో., నోరు ఉన్నోడిదే రాజ్యం అన్న చందంగా రాజకీయాలు మారిపోయాయి. “పదవులలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల గురించి మాట్లాడి.,మాజీలుగా మారాకా ప్రజలు గురించి మాట్లాడడం తప్పు మంత్రిగా” అంటున్నారు ఓటర్లు. చేతిలో అధికారం ఉన్నప్పుడు చేయలేని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే ఎలా చేస్తారు అంటూ నిలదీస్తున్నారు నియోజక వర్గ ప్రజలు.

ఏపీకి జీవనాధారం వంటి ప్రతిష్టాత్మక పోలవరం నిర్మాణం పూర్తి చేసి 5కోట్ల ఆంధ్రుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చితే, దాహార్తితో గొంతెండుతున్న ప్రజల తాగు నీటి కష్టాలు..,దేవుడి పైనే భారం వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నల సాగు నీటి వ్యధలు తీరేవి. కృష్ణ – గోదావరి వంటి రెండు నదుల సమ్మేళనమే నాటి పట్టిసీమ. ఈ ప్రాజెక్ట్ తో నాటి రైతుల సాగు నీటి అవసరాలు తీర్చారు అప్పటి ప్రభుత్వం.

అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పట్టవు…,అదే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మళ్ళి అధికారం కావాలంటారు ఇదే ఈనాటి రాజకీయం. అసలు రాజ’కీ’యాలలో ‘కీ’ (ప్రజలా,డబ్బా,నేర చరిత్రలా,సమర్థతా ) పాత్ర పోషిస్తుంది ఎవరనే ప్రశ్నకు “సమాధానం” కాలానుగుణంగా తన రూపాన్ని మార్చుకుంటూ పోతుంది.

ADVERTISEMENT
Latest Stories