నాలుగైదు రోజుల క్రితమే ఈసారి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకీ సన్నగిల్లిపోతోందని జగన్ అన్నారు. 175 సీట్లు మావే అని గొప్పలు చెప్పుకొని, విదేశాలకు బయలుదేరబోతున్న వార్త పోలింగ్ మొదలవక ముందే బయటకు లీక్ అవడంతో జగన్ అస్త్ర సన్యాసం చేసి పలాయన మంత్రం పటిస్తున్న ఉత్తర కుమారుడే అని అందరూ అనుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌కి తన పార్టీ ఎన్నికలలో ఓడిపోబోతోందని మూడు నెలల ముందే తెలిసి ఉన్నా, 117కి 100 సీట్లు మనమే గెలుచుకుంటున్నామని చెప్పుకుంటూ పార్టీ శ్రేణులను నిబ్బరంగా ముందుకు నడిపించారే తప్ప ఇలా ముందే అస్త్ర సన్యాసం చేయలేదు. ఇది గమనిస్తే ఓ రాజకీయ నాయకుడు చివరి నిమిషం వరకు ఏవిదంగా పోరాడాలో అర్దమవుతుంది.
నేటికీ కేసీఆర్ జగన్ తప్పక గెలుస్తాడని పదే పదే చెపుతూ, ఏపీ ఓటర్లను ప్రభావితం చేయడానికి తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నారు. కానీ జగన్ ముందే అస్త్ర సన్యాసం చేసేశారు.
నెల్లూరు నుంచి నరసరావుపేటలో వాలి మీసం తిప్పి తొడకొట్టి కూటమికి సవాలు చేసిన వైసీపి ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ కూడా అప్పుడే ఓటమిని అంగీకరించేసిన్నట్లే ఉన్నారు. “టిడిపికి బలం ఉన్న చోట అసలు పోలీసులే లేరు. వాళ్ళను ఇష్టం వచ్చిన్నట్లు ఓట్లు వేసుకోమని వదిలేశారు. కానీ వైసీపికి బలం ఉన్న చోట వందలాది మంది పోలీసులను మోహరించారు. ప్రజలు వైసీపికి ఓట్లు వేయకుండా టిడిపి శ్రేణులు అడ్డుకుంటుంటే అంత మంది పోలీసులు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు,” అంటూ అనిల్ కుమార్ మాట్లాడిన మాటలు ఓటమినే సూచిస్తున్నాయి.
నిన్న పోలింగ్ జరుగుతున్నప్పుడు మంత్రి రోజా మాటలు కూడా ఓటమిని సూచిస్తున్నట్లే ఉన్నాయి. తనకు నగరిలో స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలతో ఎటువంటి ఇబ్బందీ లేదని, కానీ వైసీపికి చెందిన కొందరు నేతలే తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, టిడిపి కంటే వాళ్ళే ఇంటింటికీ తిరిగి తనకు ఓట్లు వేయొద్దని చెపుతున్నారని మంత్రి రోజా చెప్పడం, ఓటమికి ముందే సాకులు సిద్దం చేసుకుంటున్నట్లు భావించవచ్చు.
ఎవరైనా గెలిచి అధికారంలోకి రావాలని తహతహలాడతారు. గెలిచే అవకాశం ఉంటే ఇప్పుడు టిడిపి, జనసేనల్లా మీడియా ముందుకు వచ్చి చాలా ఉత్సాహంగా మాట్లాడుతారు. కానీ వైసీపి నేతలకు తాము ఓడిపోతామని చెప్పుకోవడానికి కూడా తొందరేనా?
Firebrand లీడర్ల లో కూడా ఫైర్ కనిపించడం లేదు…
నిన్న రోజా, నేడు అనిల్ కుమార్ యాదవ్… ఏంటి ఈ బేల మాటలు… అది కూడా పల్నాడులో…
"TDP బలంగా ఉన్న చోట అసలు పోలీసులే లేరు. YCP బలంగా ఉన్న చోట ఒక Batallion ఉంది"#YSRCP pic.twitter.com/k2OmV9PqZ3
— M9 NEWS (@M9News_) May 14, 2024
పాపం రోజమ్మ
మొహంలో ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
"నాకు టీడీపీ వాళ్ళతో ఇబ్బంది లేదు… సొంత వాళ్ళే టీడీపీ కి ఓటు వెయ్యమని చెబుతున్నారు"#YSRCP pic.twitter.com/54PyL391Or
— M9 NEWS (@M9News_) May 13, 2024




