తాజాగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ సారి తనకు నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు చెపుతూ, తనను నమ్మి ఓటేసి ఎమ్మెల్యే గా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు తాను ఇన్నాళ్ళుగా చేసిందేమోటో, వచ్చే ఎన్నికలలో కూడా గెలిపిస్తే ఏం చేయబోతున్నారో ఒక క్లారిటీ ఇచ్చారు.
నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే గా ప్రజల మన్ననలు పొందిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గెలిచిన నాటి నుంచి తన నియోజకవర్గ ప్రజలకు ఏంచేసారో తెలియచేసారు. నన్ను ఎమ్మెల్యే గా గెలిపించినందుకు ఇన్నాళ్లు “అసెంబ్లీ కి వెళ్లి చంద్రబాబు ని తిట్టాను, ఇకపై ఎంపీ గా గెలిపిస్తే పార్లమెంట్ కు వెళ్లి బాబు ని తిడతాను” అంటూ సెలవిచ్చారు.
తనను నమ్మి ఓటేసిన ప్రజలకు ఒక ప్రజాప్రతినిధి ఏవిధంగా పని చేయాలో, అలా గెలిచిన నాయకులు వైసీపీ పార్టీలో ఏవిధంగా పని చేస్తారో తెలియని వారికీ ఒక్క ముక్కలో కండబద్దలు కొట్టారు అనిల్ కుమార్. ఈ విషయంలో ఇప్పటికే ఏపీ ప్రజలు కూడా ఒక అవగాహనకు వచ్చారనే అనుకోవాలి.తమ ఓటుకు వైసీపీ నాయకులు ఇచ్చే విలువ తెలుసుకున్న ఏపీ ప్రజలు ఈసారి ఇటువంటి నాయకులను గెలిపించి తమ ‘ఓటు విలువ తగ్గించుకుంటారో’..? లేక పాలన పై ద్రుష్టి పెట్టే నాయకులకు అండగా నిలబడి తమ ‘ఓటు విలువ పెంచుకుంటారో’ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమయింది.
ఎందుకంటే.,గతంలో మంత్రులు గా పనిచేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మచిలీపట్టణం ఎమ్మెల్యే పేర్ని నాని, ఇప్పుడు మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన నగరి ఎమ్మెల్యే రోజా, సత్తునపల్లె ఎమ్మెల్యే అంబటి రాంబాబు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్.., ఎంపీ విజయ్ సాయి…ఇలా వైసీపీ పార్టీ తరుపున గెలిచిన ప్రజాప్రతినిధులు అందరు తమను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నిస్తే వారి నుండి వచ్చే సమాధానం… మేము చంద్రబాబుని బూతులు తిట్టామ్, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి రాష్ట్ర ప్రజలకు వివరించాం.
జగన్ తాను అర్జునుడిని అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా “వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు టిష్యు పేపర్ లో చుట్టి పక్కన పడేసి మీకెందుకండి రామాయణ, మహాభారత ఉదాహరణలు” అంటూ జనసేన నేత నాగబాబు తన సోషల్ మీడియాలో ట్వీట్ వేశారు. దానికి “పవిత్ర దీపారాధనతో సిగిరెట్ ముట్టించుకునే మీకెందుకు సార్ ఈ ఉదాహరణలు” అంటూ వెంటనే కౌంటర్ వేశారు మంత్రి అంబటి.
ఇలా పక్క పార్టీ నేతల మీద కౌంటర్లు వేయడానికి ఉన్న శ్రద్ద తమ శాఖపై ఉంచితే ఏపీ లో కొన్ని ప్రోజెక్టులైన పూర్తి అయ్యేవి కదా సార్ అంటూ సోషల్ మీడియాలో మంత్రి గారికి కౌంటర్లు పడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యే లకు, మంత్రి పదవులు చేపడుతున్న మంత్రుల ప్రధమ కర్తవ్యం ఇదే అని మాజీమంత్రి అనిల్ కుమార్ చెప్పిన కూడా ఇలా మంత్రి అంబటి గారిని ఇలా “ప్రశ్నలతో వేధించడం, కౌంటర్లతో సాధించడం మీకు సబబేనా..?”ఒక్క సారి ఆలోచించాలి కదా.




