
సింగరేణిలో తవ్వే కొద్దీ బొగ్గు అన్నట్లు వైసీపిలో కూడా తవ్వేకొద్దీ ఆణిముత్యాలు బయటపడుతూనే ఉన్నాయి. గోరంట్ల డర్టీ పిక్చర్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవడంతో అవంతి, అంబటి ‘హమ్మయ్య జనాలకి మరొకడు దొరికాడు మేము బ్రతికామని’ ఊపిరి తీసుకొని ఉంటారు.
అలాగే దువ్వాడ ‘నారీ నారీ నడుమ మురారీ’తో ఎంట్రీ ఇచ్చి ‘శాంతి నివాసం’ కధతో ఇబ్బంది పడుతున్న పెద్దాయన విజయసాయి రెడ్డికి ఉపశమనం కలిగించారు. ఆయన ప్రజలని డైవర్ట్ చేసుకోవడంతో పెద్దాయన కూడా ‘హమ్మయ్య’ అని అనుకుని ఉంటారు.
Also Read – వీళ్ళు పాక్ మంత్రులా.. ఉగ్రవాదులా?
అప్పటి నుంచి ఆ ముళ్ళ కిరీటాన్ని నెత్తిన మోస్తున్న దువ్వాడ శ్రీనివాస్‌కి, ఇప్పుడు డర్టీ పిక్చర్‌తో అనంతబాబు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఆ కిరీటాన్ని తీసుకొని ఉపశమనం కలిగించారు.
కనుక ఇప్పుడు దువ్వాడ కూడా ‘హమ్మయ్య జనాలు నన్ను వదిలేసి అనంతబాబుకి కనెక్ట్ అయ్యారని’ ఊపిరి పీల్చుకొని మళ్ళీ ప్రశాంతంగా జీవన మాధుర్యం ఆస్వాదించగలుగుతున్నారు.
Also Read – కేసీఆర్ హెచ్చరికలు రేవంత్ ను భయపెట్టగలవా.?
కనుక వైసీపిలో ఈ కనెక్టివిటీ ఇక ముందు కూడా కొనసాగితే మరిన్ని మట్టిలో మాణిక్యాలు బయటపడే అవకాశం ఉంటుంది.
ఈవిదంగా వైసీపిలో బ్యాటన్ (రన్నింగ్ రేసులో స్టిక్) ఒకరి నుంచి మరొకరు అందుకుంటూ దూసుకుపోతున్నట్లే, పార్టీలోనే గిట్టనివారు కొందరు ఈ ఆణిముత్యాలని తవ్వితీసి ప్రజలకు అందిస్తూ ఈ కంటిన్యూటీ ఎక్కడ దెబ్బ తినకుండా స్టోరీ నడిపిస్తుండటం విశేషం.
Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!
అయితే ఇప్పుడు ఆ ఆణిముత్యాలన్నిటి వెనుక ఎవరెవరున్నారో చెప్పుకుంటూపోతే అదో పెద్ద కధ అవుతుంది కనుక చివరి ఆణిముత్యం అనంతబాబు డర్టీ పిక్చర్ ఎవరు రిలీజ్ చేశారో చెప్పుకుని సరిపెట్టుకుందాం.
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన ఓ వైసీపి మహిళా నాయకురాలు ఈ డర్టీ పిక్చర్ రిలీజ్ చేసిన్నట్లు సమాచారం. అయితే ఆమె వద్ద ఇంకా మంచి రసవత్తరమైన వీడియోలు ఉన్నందున అనంతబాబు ఆమెను ఏమీ అనలేక, నిన్న రిలీజ్ అయిన ‘ఆ వీడియో నాది కాదు మార్ఫింగ్ అని స్టాండర్డ్ జవాబు చెప్పి ఊరుకోవలసి వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.