సినిమాలన్నాక డిలే అవ్వడం, వాయిదాపడడం సర్వసాధారణం. కొన్ని సినిమాలు నెలలపాటు వాయిదా పడితే, ఇంకొన్ని ఏళ్ల తరబడి వాయిదా పడతాయి. అయితే.. వాయిదా పడినంత మాత్రాన ఆ సినిమాల్ని ప్రమోట్ చేయకుండా ఉండరు కదా. మొన్నామధ్య ఏకంగా 12 ఏళ్ల తర్వాత విడుదలైన “మదగజరాజా” చిత్రాన్ని హీరో విశాల్, హీరోయిన్లు అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ లు ఎంతలా ప్రమోట్ చేశారో చూశాం. కానీ.. అనుపమ మాత్రం 2022లో రూపొందిన “మరీచిక” అనే సినిమాని కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తుంది.
సతీష్ కాశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన “మరీచిక” అనే చిత్రంలో విరాజ్ అశ్విన్ హీరోగా నటించగా.. అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రాలు హీరోయిన్లుగా కనిపించారు. ఈ సినిమా అడ్డంకులన్నీ దాటుకొని ఎట్టకేలకు ఈ మే 29న రిలీజ్ అవుతోంది. పాపం కుదిరినంతలో చిత్రబృందం కూడా ఎంతో కొంత సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. సినిమా టీమ్ నుండి విరాజ్ మాత్రమే కాస్త సినిమాని పట్టించుకుంటున్నాడు తప్పితే.. అనుపమ & రెజీనా సినిమాని లైట్ తీసుకున్నారు.
వ్యక్తిత్వంగా చాలా స్వీట్ గర్ల్ అయిన అనుపమ ఇలా తాను నటించగా విడుదలవుతున్న సినిమాని మరీ ఇంతలా పట్టించుకోకుండా ఉండడం అనేది చర్చనీయాంశం అయ్యింది. మరి సినిమాలో తన లుక్స్ నచ్చలేదా? లేక కంటెంట్ మీద నమ్మకం లేదా? లేక టీమ్ తో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్ర దర్శకుడు సతీష్ కాశెట్టి తెరకెక్కించిన మునుపటి చిత్రం “టెర్రర్” పదేళ్ల క్రితం విడుదలై క్రిటిక్స్ ని సైతం ఆశ్చర్యపరిచింది. మరి “మరీచిక”తో సతీష్ కాశెట్టి సర్ప్రైజ్ చేస్తాడా? లేదా అనేది చూడాలి.




