అరుంధతి సినిమాతో టాలీవుడ్ ‘జేజమ్మ’గా ప్రేక్షకుల అభిమానాన్ని చూడకున్న అనుష్క శెట్టి బాహుబలి తో పాన్ ఇండియా ‘దేవసేన’గా గుర్తింపు పొందారు. అయితే బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ ను పూర్తిగా నిర్వీర్యం చేసుకున్న స్వీటీ తాజాగా మరోసారి మరో కొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Also Read – రెండూ సంక్రాంతి రిలీజ్ బొమ్మలే!
ఈ రోజు అనుష్క పుట్టిన రోజు సందర్భంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఆమె నటిస్తున్న ‘ఘాటీ’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను, 47 సెకెన్ల నిడివితో ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. దీనిలో తల మీద రక్తపు మరకలు, చేతిలో సిగారు పట్టుకుని, తలలు నరుకుతూ అనుష్క చాల రౌద్రంగా కనిపిస్తున్నారు అనుష్క.
అరుంధతి మూవీ తరువాత ఆ తరహా పాత్రలో అనుష్క మరోసారి చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారా అన్నట్టుగా దర్శకుడు క్రిష్ స్వీటీ పోస్టర్ను డిజైన్ చేసారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్న క్రిష్ ఘాటీ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఈసారి ఎలా అయినా హిట్ అందుకోవాలని దృఢ ఆశయంతో ఉన్నారు.
Also Read – తెలుగు తమ్ముళ్ల తడాకా..!
అటు అనుష్క కెరీర్ కు కూడా ఈ సినిమా విజయం అత్యంత కీలకం కానుంది. గతంలో వేదంతో హిట్ అందుకున్న అనుష్క, క్రిష్ కాంబినేషన్ ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని అందుకోనుందో చూడాలి. అయితే యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఘాటీ మూవీ కి బుర్ర సాయి మాధవ్ మాటలు సమకూర్చగా, విద్యా సాగర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read – బీసీల పరిస్థితి మారలేదు కానీ.. కృష్ణయ్యది మారిందిగా!