AP Alliance Govt Organised Cultural Programmes For Ministers

ఏపీ రాజకీయాలను ఒక్క ఐదేళ్లు వెనక్కి వెళ్లి పరిశీలిస్తే నాడు 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను బూతు రాయుళ్ళుగా, దాడులకు పాల్పడే రౌడీషీటర్లుగా తీర్చిదిద్దింది.

ప్రజాప్రతినిధులకు అత్యంత పవిత్రమైన అసెంబ్లీ లో మహిళలను కించపరిచి, చట్ట సభలను కౌరవ సభల మాదిరి తయారు చేసారు వైసీపీ నేతలు. అధికార పార్టీ ఎమ్మెల్యే లంటే ప్రతిపక్ష పార్టీ నేతలను బూతులతో దూషించడం, వ్యక్తిగతంగా విమర్శించడం మాత్రమే అన్నట్టుగా రాజకీయ రూపురేఖలను మార్చేశారు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు వైస్ జగన్.

Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!

అధికార, విపక్ష నాయకులంటే ఆగర్భ శత్రువుల కింద, వారు ఒకరికొకరు ఎదురుపడితే మధ్యలో పచ్చగడ్డి వేసినా భగ్గున మండిపోయేలా రాజకీయ వాతావరణాన్ని సృష్టించారు జగన్. ప్రజా సమస్యల మీద చర్చలు జరగాల్సిన చట్ట సభలలో ప్రతిపక్ష పార్టీ నాయకులకు అవమానాలు, అవహేళనలు ఎదురయ్యాయి. రాజకీయ పార్టీల మధ్య ఉండాల్సిన సిద్ధాంతపరమైన వ్యత్యాసం వ్యక్తిగత వైరం లా మారిపోయింది.

అధికార విపక్ష పార్టీల నాయకుల మధ్య ఉండాల్సిన స్నేహ పూర్వకమైన పోటీని, విద్వేష పూరిత రాజకీయంగా మార్చి రాజకీయాలను కలుషితం చేసేసారు వైసీపీ నేతలు. అయితే నేడు 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయాలలో వైసీపీ నాటిన విష భీజాలను తొలగించే ప్రయత్నం చేస్తుంది.

Also Read – అభిమానుల కలల సీజన్ ఇదేనా..?

అందులో భాగంగా అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య ఫ్రెండ్లీ వాతావరణాన్ని కొనసాగిస్తూ వారి పై కేవలం రాజకీయ విమర్శలే పరిమితమవుతూ వ్యక్తిగత దాడులకు దూరంగా ఉంటుంది. అలాగే గత ఐదేళ్ల బూతు రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజలకు కాస్త రాజకీయ ఉపశమనాన్ని కలిగించింది. వైసీపీ హయాంలో అధికార పార్టీ ఎమ్మెల్యే లంటే మీడియా ముందుకొచ్చి విపక్షాల పై విరుచుకుపడడమే అన్నట్టుగా సాగిన వాతావరణాన్ని నేడు వినోదంతో నింపేసింది కూటమి ప్రభుత్వం.

ప్రజాప్రతినిధులలో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని, క్రీడా స్ఫూర్తిని బయటకు తీసేలా కూటమి ప్రభుత్వం నిర్వహించిన కల్చిరల్ కార్యక్రమాలు ఆడే వారికే కాదు చూసే వారికి కూడా మంచి ఆహ్లాదాన్ని, వినోదాన్ని కలిగించాయి. నాడు స్టేజ్ ల మీద బూతులు తిట్టే నాయకులను చూసి పైశాచిక ఆనందాన్ని పొందే సీఎం ని చూసిన ప్రజలు నేడు స్టేజ్ మీద వినోదాన్ని పంచె కార్యక్రమాలు చేసిన నేతలను చూసి స్వచ్ఛమైన నవ్వులు చిందించిన నాయకులను చూస్తున్నారు.

Also Read – ఇటు అమరావతి…అటు విశాఖ…!

నాడు బూతులు తిడితే అధినేత నుంచి బహుమతులు లభించేవి, నేడు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలలో తమ సత్తా చూపిన నేతలకు బహుమతులు దక్కాయి. నేడు కేవలం ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకోవడానికి నోటికి మాత్రమే పని చెప్పేవారు, కానీ నేడు అధికార విపక్ష సభ్యులు ఒకరికొకరు కరచాలనం చేసుకుంటూ చూసే వారి కంటికి పని చెపుతున్నారు. వైసీపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చట్ట సభలలో తన పార్టీ గళం వినిపిస్తున్నారు, అలాగే బయట ప్రత్యర్థి పార్టీ నాయకులతో కరచాలనం చేస్తు తన బలం పెంచుకుంటున్నారు.




నాడు బూతు ప్రెస్ మీట్లు, నేడు వినోద కార్యక్రమాలు, నాడు మహిళను, కుటుంబ సభ్యులను దూషిస్తూ వ్యక్తిగత దాడులు, నేడు కేవలం రాజకీయ విమర్శలు, సిద్ధాంతపరమైన విభేదాలు మాత్రమే, నాడు ఎదుట వ్యక్తిని కించపరిచి వినోదాన్ని ఆస్వాదించేవారు, నేడు ఎదుట పార్టీ నాయకులతో(టీడీపీ, బీజేపీ, జనసేన) కలిసి వినోదాన్ని పండిస్తున్నారు. దీనితో గత ఐదేళ్ల వైసీపీ విష సంస్కృతీ ఏపీ రాజకీయాలలో పూర్తిగా మారాలి…మార్చాలి అంటున్నారు సామాన్య ప్రజానీకం.