ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా, ఆర్థికంగానే కాదు రాజకీయం పరంగా కూడా నష్టపోయిందా అనిపిస్తుంది. కొన్ని రాజకీయ పార్టీలకు రాజకీయమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదు.
అలాగే కొంతమంది రాజకీయ నాయకులు వారి పదవి, అధికారాలకే తప్ప రాష్ట్ర ప్రజల ప్రగతి పట్టకుండా పోయింది. రాజకీయ పార్టీల రాజకీయం ఆ పార్టీకి ఎంత రాజకీయ లబ్ది చేకూరుస్తుందో అలాగే రాష్ట్ర అభివృద్ధికి కూడా అంతే ప్రయోజనకరంగా ఉండాలి. కానీ ప్రస్తుతంలో ఏపీలో రాజ్కియాయ్ పార్టీల రాజకీయం అలా కనిపించడం లేదు.
రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి పుష్కర కాలం గడిచినా ఇంకా రాజధాని మీద అధికార – విపక్ష పార్టీలకు భిన్న అభిప్రాయాలే, రాజధాని లేకుండా రాష్ట్రం ఆర్థికంగా చితికిపోతుంది అన్న బాధే వైసీపీ కి లేకుండా పోయింది. రాజధాని మీద రాజకీయం రాష్ట్ర పారిశ్రామికాభివృద్దికి అడ్డుగోడగా మారుతుంది అన్న ఆలోచన వైసీపీ నేతలకు రావడం లేదు.
జగన్ కు కేవలం బాబు ప్రతిపాదించిన అమరావతి ప్రాంతం రాజధానిగా ఉండడానికి వీలులేదు అనే మూర్కత్వమే, ఇక పార్టీ నేతలకు తమ అధినేత ఆదేశాలు గుడ్డిగా పాటించాలి అనే భావనే కానీ ఇటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్ కి లాభమా.? నష్టమా.? దీని వాళ్ళ ఇక్కడి ప్రజలకు ఉపాధి లభిస్తుందా.? ఆర్థికంగా అభివృద్ధి చెందుతారా అన్న ధ్యాసే వైసీపీ కి లేకుండా పోతుంది.
దీని ఫలితంగా దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర రాజధానిగా ఒక ప్రాంతం పేరును చట్టం చేయడం, దానికి పార్లమెంట్ ఉభయసభల నుంచి చట్టబద్దత కల్పించడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఏపీ రాజకీయాలు ఎంత ఘోరమైన పరిస్థితులలో ఉన్నాయో అర్ధమవుతుంది.
2015 లో రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరును ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు వైసీపీ ఏదోరకంగా రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అసలు రాజధాని నిర్మాణంతో వైసీపీ కి వచ్చే రాజకీయ నష్టమేమిటో ఇప్పటికి అర్ధం కానీ ప్రశ్నే.
రాష్ట్ర ప్రయోజనాలను హరిస్తూ, రాష్ట్ర భవిష్యత్ ని ప్రశ్నార్దకంలోకి నెడుతూ వైసీపీ చేస్తున్న ఈ రాజకీయాన్ని ఏమనాలి.? వైసీపీ పార్టీకి ఒక రాష్ట్ర ప్రగతి కన్నా ఒక వ్యక్తి పంతమే ముఖ్యమా.? వైసీపీ నాయకులకు రాష్ట్ర ప్రజల భవిష్యత్ కన్నా పార్టీ అధినేత ఆదేశాలే విలువైనవా.?
రాజధానిగా ఏడాదికో పేరు ప్రకటిస్తూ ఆ పేరుతోనే రాష్ట్ర అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తూ వైసీపీ చేస్తున్న రాజకీయం ప్రాంతాల మధ్య విద్వేషం సృష్టించడం కాదా.? ఒక నాయకుడి విజనరీ మీద ఉన్న అసూయ, ఒక పార్టీ మీదున్న రాజకీయ ద్వేషం రెండు కలిపి వైసీపీ ని ఇంత మూర్ఖంగా మార్చేసిందా.?
వైసీపీ చేస్తున్న ఈ ప్రాంతాల మధ్య రాజకీయం తో ఏపీకి ఒరిగిందేమిటి.? వైసీపీ ఇలా ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలను ఈ రకంగా అడ్డుకుంటుంటే, మరోపక్క బీసీల హక్కులు, వాటి కోసం దీక్షలు, అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు అంటూ BCY అధినేత రామచంద్ర యాదవ్ ఏపీలో లేని బీసీ కుల రాజకీయం మొదలుపెట్టారు.
ఇక జై భీం అంటూ జగన్ నినాదాల కోసం, వైసీపీ విధానాల కోసం నిత్యం సాక్షిలో కష్టపడుతుంటారు జడ శ్రావణ్ కుమార్. దళితుల కోసమే నా ఈ పోరాటం, వారి హక్కుల కోసమే నా ఈ ఆరాటం అంటూ మీడియా ముందుకొచ్చే శ్రావణ్ కు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు, కేవలం రాజధాని అమరావతి మీద విషం చిమ్మి రాష్ట్ర ప్రభుత్వం పై బురద జల్లడమే ఈయన రాజకీయం.
ఇలా రాజకీయ పార్టీల పేరుతో, పార్టీల అధినేతల హోదాలో ఈ సోకాల్డ్ రాజకీయ నేతలు రాష్ట్రానికి చేస్తున్న మేలేమిటంటే ఒకరు ఆంధ్రప్రదేశ్ ని ప్రాంతాలుగా విభజిస్తున్నారు, మరొకరు కులాల మధ్య ద్వేషాలను సృష్టిస్తున్నారు, మరొకరు పార్టీల మధ్య రాజకీయ మంటలు రేపుతున్నారు.
అసలు ఆ సోకాల్డ్ రాజకీయ పార్టీలకు, ఆయా పార్టీల నాయకులకు రాష్ట్ర ప్రజలకు ఎం కావాలి.? వీరి నుంచి వారేమాసిస్తున్నారు అనేది అవసరం లేకుండా పోయింది. తమ పార్టీ కోసం ఎం చెయ్యాలి, తమ అధినేత మెప్పు కోసం ఎంత దిగజారిపోవాలి, దాని కోసం రాష్ట్ర భవిష్యత్ ను సైతం పణంగా పెట్టేయొచ్చు అనే స్థాయికి ఎన్నడూ లేని విధంగా ఏపీ రాజకీయాలు దిగజారిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తో దెబ్బతిన్న దాని కంటే కూడా ఈ పార్టీల రాజకీయంతో దెబ్బతిన్నది, తింటున్నదే ఎక్కవ. నాడు హైద్రాబాద్ అభివృద్ధికైనా, నేడు అమరావతి ప్రగతికైనా నిలకడ కలిగిన విజనరీ నాయకుడి అవసరం ఉంది, అలాగే కొన్నేళ్ల పాటు రాష్ట్రంలో స్థిరత్వం కలిగిన ప్రభుత్వ పాలన కొనసాగాలి. అప్పుడే అమరావతి కూడా మరో హైద్రాబాద్ గా ఎదుగుతుంది. ఏపీ కూడా మరో గుజరాత్ గా మారుతుంది.




