ఈ ఏడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతి ఒక్క మాటలో చెప్పాలి అంటే నాడు మటన్ షాపులు, ఫిష్ మార్ట్లు…నేడు ఐటీ పరిశ్రమలు, క్వాంటం వాలీ…అని చెప్పవచ్చు.
అలాగే నాటికీ నేటికీ జరిగిన అభివృద్ధి కళ్లారా చూడాలి అంటే నాడు అరణ్యంలా మారిన అమరావతి నేడు నిర్మాణ పనులతో హడావుడిగా మారింది. ఇక నాడు గుంతల మధ్య రోడ్లను గమనించిన సామాన్యులు నేడు నాణ్యమైన రవాణా వసతులను అనుభవిస్తున్నారు.
నాడు వాలంటీర్లతో నడిచిన ప్రభుత్వం, సలహాదారులతో సాగిన పాలన నేడు ప్రభుత్వ ఉద్యోగులతో, ప్రజాప్రతినిధులతో ముందుకెళ్తుంది. గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ యువతను వాలంటీర్ ఉద్యోగాలకు పరిమితం చేసిన వైసీపీ నేడు రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను ఆహ్వానించలేకపోతుంది.
నాడు బూతులతో రెచ్చిపోయిన మంత్రులను చూసిన ఆంధ్రప్రదేశ్ నేడు ప్రజాదర్బార్లను నిర్వహిస్తున్న నాయకులను చూస్తుంది. నాడు పరదాల చాటున, ప్యాలస్ పాలన చేసిన ముఖ్యమంత్రిని చూసిన ఏపీ వాసులు నేడు వాలంటీర్ మాదిరి సామాన్యుడి ఇంటికి వెళుతున్న ముఖ్యమంత్రిని చూస్తున్నారు.
నాడు ప్రభుత్వ కార్యాలయాల నుంచి చెత్త సేకరించే వాహనాల వరకు వైసీపీ రంగులతో చేసిన రాజకీయాన్ని గమనించిన ప్రజలు నేడు పార్టీ రంగుల, నాయకుల చిత్రాల బదులు ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్రను చూస్తున్నారు.
నాడు ఏపీకి మూడు రాజధానులు అంటూ ప్రచారం జరిగినా ఒక్క రాజధాని కూడా అభివృద్ధికి నోచుకోలేదు, నేడు ఏపీకి ఏకైక రాజధాని అమరావతే అంటూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇలా నాటి పాలనకు నేటి ప్రభుత్వానికి ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని ఏపీ ప్రజలు గమనిస్తున్నారు.






