
వైసీపీ ఓటమి కూడా జగన్ కు పాఠాలు నేర్పలేకపోతుంది, ఆ పార్టీ శ్రేణులకు జ్ఞానోదయం కల్పించలేకపోతుంది. గత ఐదేళ్ల వైసీపీ విధ్వంశాన్నే సహించలేని ఆంధ్రప్రదేశ్ ఇక రేపు రాబోయే జగన్ 2.0 వినాశనాన్ని ఆహ్వానిస్తుందా.?
కానీ అవేమి ఆలోచించని వైసీపీ నేతలు అదే హింసాత్మక ధోరణితో ముందుకెళుతూ వచ్చేది మేమే…అంతు చూసి తీరుతాం అంటు రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఇప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్ ను తన బెదిరింపులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read – కూటమి పై సామాన్యుడి ఆగ్రహం…
ప్రతిపక్షంగా వైసీపీ ప్రభుత్వ చర్యలను తప్పుబట్టడం సహజం. అయితే ఆ చర్యల ఫలితంగా అయితే ఒకటి ప్రజలకు మేలు జరగాలి, లేకుంటే మరొకటి ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టగలగాలి.
కానీ వైసీపీ చేసే నిరసన కార్యక్రమాలలో కానీ, ఆందోళన చర్యలలో కానీ ప్రజలకు న్యాయం జరగపోగా, ఆ యాత్రల ఫలితంగా బలప్రదర్శనకు పాల్పడుతున్న వైసీపీ మరికొంతమందిని తమ బాధితులుగా మారుస్తుంది.
Also Read – గుడివాడ ఫ్లెక్సీ వివాదం..
చివరికి వైసీపీ అధిష్టానం చేస్తున్న రాజకీయంతో ప్రజల ముందే కాకుండా తన పార్టీ మద్దతుదారుల ముందు కూడా వైసీపీ దోషిగా నిలబడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇందుకు తెనాలి, పొదిలి, సత్తెనపల్లి ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
నాడు అధికారంలో ఉన్న ఐదేళ్లు వైసీపీ తీసుకున్న నిర్ణయాలకు, ప్రభుత్వ విధానాలకు విసిగిపోయిన ప్రజలు వైసీపీ ని 151 తో అధికార పార్టీగా భరించలేక 11 తో ప్రతిపక్షానికి కూడా దూరం చేసారు.
Also Read – సైకో రాజకీయాలు చేయవద్దని చెప్పా: పేర్ని నాని
అయితే ఏపీ రాబోయే ఎన్నికలలో గెలిచి వైసీపీ మరో ఛాన్స్ తీసుకుని ఇక రాష్ట్రంలో అరాచకం 2.0 ని సృష్టిస్తాం, ఇప్పటి ప్రభుత్వ చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటాం, నేటి అధికారులనే రేపటి బాధితులుగా మారుస్తాం,
రాజధాని అమరావతిని విధ్వంశం చేస్తాం, అడ్డొచ్చిన వారిని రప్ప రప్ప నరుకుతాం అంటు వైసీపీ శ్రేణులు బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతుంటే అడ్డుచెప్పాల్సిన అధినేతే తప్పేముంది అంటు ఎదురు ప్రశ్నిస్తున్నాడు. ఇదంతా కూడా వైసీపీ భవిష్యత్ ఆలోచన దృక్పధాన్ని అద్దం పడుతుంది.
అంటే రానున్న ఏపీ ఎన్నికలు వైసీపీ విధ్వంశం కోసం, రాష్ట్ర వినాశనం కోసం ఎదురుచూస్తున్నాయా.? జగన్ 2.0 అంటే వైసీపీ, ప్రజలు కోసం కాకుండా పార్టీ కార్యక్తల కోసం అధికారం అడుగుతుందా.? జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి కాకుండా తన స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడనికి పదవులు కోరుకుంటున్నారా.?
ఐదేళ్ల అధికారాన్ని తన వ్యక్తిగత స్వార్ధం కోసం, పార్టీ నేతల మెప్పు కోసం జగన్ వినియోగించడానికి సిద్దపడుతున్నారా.? ఇప్పుడు జగన్ చేస్తున్న చర్యలు, ఇస్తున్న ప్రకటనలు అందుకు సంకేతాలుగా భావించాలా.? అంటే ఒకవేళ వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పాలన విధానం ఎలా ఉండబోతుందో, దాని ఫలితాలు రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజార్చనున్నాయో అన్న స్పష్టత ఏపీ ప్రజలకు వైసీపీ ఇచ్చినట్టేనా.?
తన కారు కింద పడి ఒక వ్యక్తి నలిగిపోతున్నా తన పర్యటనను కొనసాగించాల్సిందే అనే జగన్ ఆలోచన ధోరణి, కనీసం ఆ వీడియో బయటకొచ్చిన తరువాతైనా జరిగిన తప్పుకి పచ్చాత్తాపం తెలుపని వైసీపీ మనస్తత్వం రాష్ట్ర భవిష్యత్ ను శాసించడానికి సిద్దమయ్యింది.
ఒక ప్రాంతం మీద ఉన్న పగతో ఆ ప్రాంత మహిళలందరిని కించపరచాలి అనే సాక్షి ఉద్దేశాలు, ఆ ప్రాంతాన్ని స్మశానంగా మార్చాలి అనే వైసీపీ విష ప్రచారాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చడానికి సన్నద్ధమయ్యింది.
ఇటువంటి రాజకీయ పార్టీల రాజకీయ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు అత్యంత ప్రమాదకరం. అయితే కూటమి రాకతో ఆంధ్రప్రదేశ్ కు వసంత కాలం మొదలయ్యింది. వైసీపీ హయాంలో బూతులు, దాడులు చూసిన ఏపీ ఇప్పుడు పరిశ్రమలు, పెట్టుబడులు చూస్తుంది.
గత ఐదేళ్లు రాజధాని లేని రాష్ట్రంగా అందరి ముందు అవమాన భారంతో తలవంచిన ఏపీ నేడు అమరావతి నిర్మాణాలతో అందరిని చూపుని తన వైపు తిప్పుకుంటుంది. ఇక రాబోయే నాలుగేళ్ళ కూటమి పాలనతో ఏపీ వికసిత ఆంధ్రప్రదేశ్ గా రూపం మార్చుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తోంది.
ఇలా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రయాణానికి వైసీపీ అనే విధ్వంశం ఒక మార్గాన్ని చూపిస్తుంటే, కూటమి అనే వసంతం మరో మార్గాన్ని తయారు చేస్తుంది. మరి ఏపీ వాసులు ఏ మార్గాన్ని ఎంచుకుంటారో.? రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకెళ్తారో ఆలోచించుకోవాల్సి ఉంటుంది.