రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తప్పనిసరిగా ఇతర పార్టీలు, ప్రభుత్వాలతో పోల్చుతూ తమ గురించి చెప్పుకుంటాయి. జగన్ హయంలో తెలుగు భాషని హత్య చేసేందుకు కుట్ర జరిగిందని చెప్పవచ్చు.
ప్రభుత్వ పాఠశాలలో బలవంతంగా ఇంగ్లీష్ మీడియం, బైజూ ఆన్‌లైన్ పాఠాలు పేరుతో విద్యార్ధులకు ట్యాబ్స్ పంపిణీ వంటివన్నీ తెలుగు భాష హత్యకు జరిగిన కుట్రలుగానే పరిగణించాల్సి ఉంటుంది.
కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే కాదు.. ప్రభుత్వ కార్యాలయాలలో, అధికారులు-ఉద్యోగులు మద్య ఫైల్స్, అన్ని రకాల పత్రాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, జీవోలు మొత్తం ఇంగ్లీషు భాషలోనే జరిగేవి.
సంక్షేమ పధకాలు, మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఏవిదంగా జగన్ వితండవాదం చేసేవారో ఆదేవిదంగా కేవలం ఇంగ్లీషు భాషతోనే జీవితంలో రాణించగలరని వాదించేవారు. అందుకే తెలుగు భాషని ఓ పద్దతి ప్రకారం హత్య చేసి ఇంగ్లీషు భాషని ప్రోత్సహించేవారు.
విద్యావ్యవస్థ మీద జగన్ చేసిన ఈ విషప్రయోగం వలన ఆయన హయంలో విద్యార్ధులు అటు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించలేక తెలుగు భాషకి దూరమయ్యి నష్టపోయారు. ఈ విషయం వారికి విద్యా బోధన చేసే ఉపాధ్యాయులకు బాగా తెలుసు.
జగన్ హయంలో తెలుగు భాషకి జరిగిన అవమానాన్ని, నష్టాన్ని సిఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సరిచేసి మళ్ళీ పట్టం కడుతోంది. ఇప్పటికే విద్యావ్యవస్థలో జరిగిన ఇంగ్లీషు తప్పులను సరిచేసి మళ్ళీ తెలుగులోకి తెచ్చారు.
ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) అన్నీ ఇంగ్లీషుతో పాటు తప్పని సరిగా తెలుగులోనూ జారీ చేయాలని ప్రభుత్వం అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల తెలుగు భాషాభిమానులు చాలా సంతోషిస్తున్నారు.
మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న విజయవాడలో పుస్తక ప్రదర్శన ఆరంభిస్తూ, తాను పుస్తకాల కొనుగోలు, చదివే అలవాటు, దాని వలన ప్రయోజనాలు వివరిస్తూ, తన అభిమానులు అందరూ కూడా తెలుగు పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని కోరడం చాలా అభినందనీయం.
మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, సినిమాలు, రాజకీయాలు వగైరా మాదక ద్రవ్యాల మాదిరిగా వ్యసనంగా మారిపోతున్న ఈ రోజుల్లో విజయవాడలో పుస్తకాల ప్రదర్శనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తెలుగు రచయితల పుస్తకాలు కొనుగోలు చేస్తుండటం మరో శుభపరిణామమే.
మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లలో కూడా తెలుగు భాష వినియోగించే సాఫ్ట్ వేర్ అందుబాటులోకి రావడం కూడా తెలుగు భాషకి చాలా మేలు చేస్తోంది.
తెలుగు భాషాభివృద్ధి అంటే బ్రహ్మ పదార్ధం కాదు. ఇటువంటి చిన్న చిన్న ఆలోచనలు, ప్రయత్నాలతోనే తెలుగు భాష అభివృద్ధి జరుగుతుంది.
చివరిగా ఒక్క మాట: తెలుగుని వద్దనుకుంటే మన ఉనికి లేదా గుర్తింపుని మనమే వద్దనుకోవడమే. తెలుగు భాషతో ముడిపడున్న మన సాహిత్యం, సంస్కృతీ సాంప్రదాయాలు, కళలు అన్నిటినీ మనం వదులుకుంటున్నట్లే అని గ్రహించాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు అర్ధమయ్యేలా ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు రానున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనూ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంగ్లం, తెలుగులో ఉత్తర్వులు జారీ చేయాలని వివిధ శాఖలకు ఆదేశాలు ఇచ్చింది.
గత ప్రభుత్వంలో… pic.twitter.com/uKhlRMWF92
— Telugu Desam Party (@JaiTDP) January 4, 2025




