APCID New Delhi Press Meetఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై రాజకీయ కక్షతో స్కిల్ డెవలప్‌మెంట్‌ తప్పుడు కేసు సృష్టించి అన్యాయంగా అరెస్టు చేయిందని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి, టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ జాతీయ మీడియాకు ఏపీలో నెలకొన్న అరాచక రాజకీయ పరిస్థితులను వివరిస్తున్నారు.

మరోపక్క సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ కూడా ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు రాజకీయ దురుద్దేశ్యంతో పెట్టిన్నదే తప్ప దానిలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, దానికి సంబందించి పూర్తి వివరాలను వెల్లడించారు.

దీంతో వైసీపి ప్రభుత్వం కూడా ఏపీ సిఐడి చీఫ్ సంజయ్, ఏపీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఏపీ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌లను ఢిల్లీకి పంపించగా వారు ఆదివారం మధ్యాహ్నం అశోకా హోటల్లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.

కానీ దానికి ఎంపిక చేసిన జాతీయమీడియాకు చెందిన కొందరిని మాత్రమే లోనికి అనుమతించారు. ఢిల్లీలోని తెలుగు మీడియా ప్రతినిధులతో సహా మిగిలిన జాతీయ మీడియా ప్రతీధులను కూడా లోనికి అనుమతించలేదు. ప్రెస్‌మీట్‌ పెట్టి ఈ కేసులో వాస్తవాలు వివరిస్తున్నప్పుడు మీడియాలో కొందరిని మాత్రమే అనుమతించి, మిగిలిన వారిని అనుమతించకపోవడంతోనే ఈ కేసులో తమ తప్పులు కప్పి పుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ కేసు పూర్వాపరాల గురించి పూర్తి అవగాహన ఉన్న తెలుగు మీడియాను ప్రెస్‌మీట్‌కు అనుమతిస్తే వారు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పుకోవడం చాలా కష్టం అవుతుంది. కనుక దీని గురించి పూర్తి అవగాహన లేని ఎంపిక చేసిన జాతీయ మీడియాకు పీ ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని సమర్ధించుకొనేందుకే వారు ఈవిదంగా చేసి ఉండవచ్చు.

ఎంపిక చేసిన జాతీయ మీడియా ప్రతినిధులతో రహస్యంగా ప్రెస్‌మీట్‌ నిర్వహించిన్నప్పటికీ, వారు అడిగిన ప్రశ్నలకు కూడా ముగ్గురూ సమాధానాలు చెప్పలేక తడబడటం గమనిస్తే ఇది రాజకీయ దురుదేశ్యంతో సృష్టించిన కేసే అని స్పష్టమవుతోంది.

అంతేకాదు…. ఈ వ్యవహారంలో మంత్రులు, అధికారుల మీడియా సమావేశాలలో పొంతన లేకుండా మాట్లాడుతున్న మాటలతో చివరికి వైసీపి ప్రభుత్వమే చిక్కుకుపోయేలా చేస్తున్నారని చెప్పవచ్చు.