ఆ హామీని కూటమి ప్రభుత్వం ఇలా సరిపెట్టేసిందా?

APSRTC-Revenue

తెలుగుదేశం ఎన్నికల హామీలలో రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం కూడా ఒకటి. ఆగస్ట్ 15 నుంచి ఈ పధకాన్ని అమలు చేయబోతోందని వార్తలు వచ్చాయి కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

ADVERTISEMENT

కూటమి ప్రభుత్వం దీపావళి పండుగకు ముందు మంత్రివర్గ సమావేశంలో మూడు ఉచిత గ్యాస్ సిలెండర్ల పధకానికి ఆమోదం తెలిపి వెంటనే అమలు చేయడం ప్రారంభించింది. కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పధకం అమలు ప్రస్తావన చేయలేదు.

కనుక ఈ పధకం గురించి ప్రభుత్వం తర్వాత నిర్ణయం తీసుకుంటుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఏపీఎస్ ఆర్టీసీ, ఆ తర్వాత టిడిపి సోషల్ మీడియాలో 60 ఏళ్ళు నిండిన సీనియర్ సిటిజన్స్ ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కూడా టికెట్‌ ధరలో 25శాతం రాయితీ ఇస్తున్నట్లు ట్వీట్‌ చేశాయి. దీని కోసం ఆధార్, కార్డుతో సహా ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే చాలని ఏపీఎస్ ఆర్టీసీ, టిడిపి పేర్కొన్నాయి.

అయితే ఈ పధకం ఎప్పటి నుంచో అమలులో ఉంది. కానీ గుర్తింపు కార్డు విషయంలో ప్రయాణికులు, ఆర్టీసీ కండెక్టర్స్ మద్య కొన్నిసార్లు వాగ్వాదాలు జరుగుతుండటంతో ఏపీఎస్ ఆర్టీసీ గుర్తింపు కార్డులపై వివరణ ఇస్తూ ట్వీట్‌ చేసిందని అందరూ భావించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మహాలక్ష్మి పధకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఆ మేరకు టిజిఎస్‌ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయాన్ని ప్రభుత్వం భర్తీ చేస్తోంది. కానీ అది ప్రభుత్వానికి భారంగానే మారింది.

ప్రభుత్వం చెల్లింపులో ఏమాత్రం ఆలస్యం అయినా ఆ భారం టిజిఎస్‌ఆర్టీసీ మీద పడుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ సమస్యలన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఈవిదంగా సరిపెట్టేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై వైసీపి విమర్శలు గుప్పించక ముందే కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పధకం గురించి వివరణ ఇస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories