ఇదేనా జగనన్న తెచ్చిన రాజన్న రాజ్యం!

APSRTC Driver Beaten By YSRCP Leaders

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీల నేతల మీదే కాదు సామాన్యుల మీద కూడా వైసీపీ నేతల అనుచరుల దాడులు ఎక్కువైపోతున్నాయి అనడానికి ఈ ఘటన మరో నిదర్శనంగా నిలిచింది.

నెల్లూరు జిల్లా కావలి సమీపంలో మెయిన్ రోడ్డు మీద ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్ పై అధికార పార్టీ నేతలు అనుచితంగా దాడికి పాల్పడిన విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెలుగులోకి వచ్చింది. అంత విచక్షణా రహితంగా దాడిచేయడానికి కారణాలు ఏమిటో ఇంకా పూర్తిగా బయటకురాలేదు.

ADVERTISEMENT

రోడ్డుకి అడ్డంగా ఆగిఉన్న వారి వాహనాన్ని పక్కనపెట్టమనే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ హార్న్ కొట్టడం వారికి ఇబ్బందిని కలిగించిందంటా! అందుకే ఆ బస్సు డ్రైవర్ పై దాడికి దిగారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే నిజానిజాలు ఏమిటో విచారణలోనే తేలాల్సి ఉంది.

తప్పు ఎవరిదైనా ఆ రకంగా ఒక వ్యక్తి పై పది మంది కలసి కాళ్ళతో తలపైనా, పొట్టపైనా తంతు పైశాచికంగా వ్యవహరించిన వైనం ఇప్పుడు సామజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తుంది.ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న సెల్ ఫోన్ లను సైతం లాక్కుకుని పగలకొట్టిన దృశ్యాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంతా జరిగిన విషయం బయటకు పొక్కకపోవడం అధికార పార్టీ మీద, పోలీస్ శాఖ మీద పలు అనుమానాలకు తావిస్తున్నాయి.

సామజిక సాధికారత పేరుతో బస్సు యాత్రలు చేయడం కాదు అసలు సమాజంలో ఏంజరుగుతుందో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు తన ప్యాలస్ వదిలి బయటకు వస్తే తెలుస్తుంది అంటున్నారు విపక్షాల నేతలు. నిన్న ఖమ్మంలో అంబటి మీద టీడీపీ మద్దతుదారులు గో బ్యాక్ అంబటి అంటూ నిరసన వ్యక్తం చేస్తేనే దానిని కులాలకు ఆపాదించి ఇది ఒక సామజిక వర్గం వారి “కులాహంకారం” అంటూ చెప్పుకొచ్చిన మంత్రి గారికి మరి ఇది ఏ తాలూకా అహంకారమో కూడా సెలవిస్తే తెలుసుకుంటాం అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అధికార పార్టీ నేతల దాష్టికాలకు ఇదే మొదటి ఉదాహరణ కాదు, పుంగనూరు ఘటన మరవకముందే ఇప్పుడు కావలి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది కూడా సోషల్ మీడియాకు ఎక్కబట్టి ప్రజల దృష్టికి వచ్చింది కానీ లేకపోతే అధికారం అనే అహంకారం కాళ్ళ క్రింద పడి సమాధి కావాల్సిందే అంటున్నారు ఈ వీడియోను చూస్తున్నవారు.ఇదేనా ఎన్నికల ముందు “జగనన్న చెప్పిన రాజన్న రాజ్యం” అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories