గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు…

ashok-gajapathi-raju-goa-governor

మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు పూసపాటి అశోక గజపతి రాజు గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసారు.

విజయనగరానికి చెందిన అశోక గజపతిరాజు టీడీపీ కీలక నేతలలో ఒకరుగా పేరు సంపాధించుకున్నారు. అలాగే 2014 – 18 వరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పని చేసారు.

ADVERTISEMENT

టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా గజపతి రాజు కి టీడీపీ తో అనుబంధం ఏర్పాటయింది. తొలినాళ్లలో విజయనగరం నుంచి ఎమ్మెల్యే గా నెగ్గిన రాజు అటు పైన ఎంపీగా ప్రమోషన్ సాధించి ఢిల్లీ రాజకీయాలలో అడుగుపెట్టారు.

ఎమ్మెల్యే గా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీ గా, కేంద్ర మంత్రిగా ఇలా రాజకీయాలలో ఒక్కో మెట్టు ఎదుగుతూ తాజాగా గవర్నర్ స్థాయికి చేరుకున్నారు గజపతిరాజు. దీనితో టీడీపీ శ్రేణులు రాజు కి దక్కిన ఈ అవకాశం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ద్రౌపది ముర్ము మూడు రాష్ట్రాలకు గాను గవర్నర్ల నియామకం చేపట్టగా అందులో గోవాకు అశోక గజపతిరాజు, హర్యానాకు ఆసిం కుమార్ ఘోష్, లడక్ లెఫ్నెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తా నియమితులయ్యారు.

టీడీపీ సీనియర్ నాయకుడికి కేంద్ర ప్రభుత్వం ఈ అరుదైన గౌరవం ఇవ్వడం పట్ల టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేసారు. రాష్ట్రపతి ముర్ము కి కృతజ్ఞతలు తెలుపుతూ గజపతి రాజు నియామకం రాష్ట్రానికి గర్వకారణం అంటూ రాజు గారికి శుభాకాంక్షలు తెలియచేసారు.

ADVERTISEMENT
Latest Stories