వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీం కోర్టుకి తెలియజేసింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్, సహ నిందితుల బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం నేడు విచారణ జరిపింది.
ఈ కేసు దర్యాప్తు పూర్తయిందని, కానీ కోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ జరుపుతామని సీబీఐ తెలిపింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసులో నిందితుడుగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆదేశం మేరకే కడప పోలీసులు సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ విచారణాధికారి రామ్ సింగ్‌లపై కేసులు నమోదు చేశారని సీబీఐ న్యాయవాది సుప్రీం కోర్టుకి తెలిపారు.
ఈ కేసులో నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారనడానికి ఇదే బలమైన నిదర్శనమని అవినాష్ రెడ్డితో సహా మిగిలిన నిందితుల బెయిల్ రద్దు చేయాలని వాదించారు.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీతా రెడ్డి తరపు వాదిస్తున్న సిద్ధార్ధ లుద్రా వేరే కోర్టులో ఉన్నందున, ఆయన తరపు అభ్యర్ధన మేరకు ఈ కేసు విచారణను భోజన విరామం తర్వాత చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం తెలిపారు.
కనుక ఈ కేసులో అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళే సమయం ఆసన్నమైనట్లే అనిపిస్తోంది. మరోపక్క మద్యం కుంభకోణం కేసు కేసులో ‘బిగ్ బాస్ రైట్ హ్యాండ్’ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కసిరెడ్డి రాజ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు తదితరులు అందరూ అరెస్ట్ అయ్యారు.
ఈ రెండు కేసులు ఓకే సమయంలో ఈవిదంగా క్లైమాక్స్ చేరుకోవడం యాదృచ్చికమే కావచ్చు. కానీ వివేకా హత్య కేసుని ఇంతవరకు పొడగించుకు రావడం వలననే మద్యం కుంభకోణం కేసుతో బాటు వివేకా కేసు కూడా క్లైమాక్స్ చేరుకుంది. ఒకవేళ సుప్రీం కోర్టు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్, మిగిలిన నిందితుల బెయిల్ రద్దు చేస్తే తర్వాత ‘బిగ్ బాస్’ వంతే కావచ్చు. జగన్ ఒకటనుకుంటే దేవుడి స్క్రిప్ట్ ఎప్పుడూ మరోలా ఉంటోందేమిటో?






