ఆత్మలతో మాట్లాడేవాడు దెయ్యమే కదా!

Sajjala Ramakrishna reddy and ayyanna patruduరాత్రి సమయంలో తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మతో మాట్లాడతాను అంటూ ఓ ప్రభుత్వ అధికారికి వైఎస్ జగన్ చెప్పినట్లుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఓ కధనం గతంలో ప్రసారమైన విషయం తెలిసిందే. అప్పట్లో సంచలనంగా మారిన ఈ కధనం, అప్పుడప్పుడూ తెరపైకి వస్తుంటుంది.

తాజాగా దెయ్యాలను లీడ్ చేసే గ్రూప్ గా జగన్ పేరును పలికిన సజ్జల వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియా వేదికగా ఓ పంచ్ వేసారు. “ఆత్మలతో మాట్లాడేవాడు దెయ్యమని ప్రత్యేకంగా చెప్పాలా సజ్జల గారు, ఆల్రెడీ ప్రజలంతా అనుకుంటున్నారు” అంటూ ట్వీట్ చేసారు.

ADVERTISEMENT

ఆత్మలతో మాట్లాడడంపై అయ్యన్న వేసిన పంచ్ ఒక్క జగన్ మోహన్ రెడ్డి కే పరిమితం కాలేదు. గతంలో వివిధ సందర్భాలలో వైసీపీ నేతల తీరును ప్రస్తావిస్తున్న సమయంలో తెలుగుదేశం నేతలు వేసే ప్రధాన విమర్శనాస్త్రాలలో ఈ “ఆత్మల” పంచ్ కూడా ఒకటి. ముఖ్యంగా వైసీపీని డిఫెన్స్ లోకి నెట్టేటపుడు టీడీపీ నేతలు దీనిని వెలికి తీస్తుంటారు.

విశేషం ఏమిటంటే… సాధారణంగా ఎలాంటి విమర్శలు చేసినా విరుచుకుపడిపోయే వైసీపీ నేతలు, ఈ ఆత్మల పంచ్ లపై మాత్రం పెద్దగా స్పందించరు. ఒకవేళ దీనిపై చర్చ పెడితే ఇది అంత లోతుకు వెళ్తుందని భావిస్తారో లేక వైసీపీ అధిష్టానం నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయో గానీ, ఈ విమర్శలకు సకల శాఖా మంత్రిగా పిలవబడుతున్న సజ్జల కూడా ఎప్పుడూ ఏం స్పందించలేదు.

ADVERTISEMENT
Latest Stories