Banakacharla project Telangana AP

ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టులో ఇమిడి ఉన్న సమస్యలు, అంశాలు అన్నీ పరిష్కరించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనని వెనక్కి తిప్పి పంపడంతో, తెలంగాణలో దానిని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేసిన బిఆర్ఎస్ పార్టీ మొట్ట మొదట ఆ క్రెడిట్ సొంత చేసుకునేందుకు ప్రయత్నించింది.

తమ పార్టీ చేసిన పోరాటాల వల్లనే కేంద్రం ఆ ప్రాజెక్టుని తిరస్కరించిందని హరీష్ రావు చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని దీంతో మరోసారి నిరూపించుకున్నామని హరీష్ రావు అన్నారు.

Also Read – గుడివాడ ఫ్లెక్సీ వివాదం..

బిఆర్ఎస్ పార్టీ ఒత్తిడితో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా దీనిని వ్యతిరేకిస్తూ మాట్లాడక తప్పలేదు. కనుక తాము అడ్డుకోవడం వల్లనే ఈ ప్రాజెక్ట్ ఆగిందని కాంగ్రెస్‌ మంత్రులు చెప్పుకుంటున్నారు.

ఎన్నికలలో ఓడిపోయి, కుటుంబ వివాదాలతో సతమతమవుతున్న బిఆర్ఎస్ పార్టీ పునరుజ్జీవం కొరకే బనకచర్ల పేరుతో రాజకీయాలు చేసింది తప్ప దానికి తెలంగాణ ప్రయోజనాలపై ఎటువంటి ఆసక్తి లేదని, నిజానికి కేసీఆర్‌ హయంలోనే ఏపీలో రాయలసీమకు నీళ్ళు తీసుకుపోవచ్చని అంగీకరించారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Also Read – బీసీ రిజర్వేషన్స్: బీఆర్ఎస్‌లో గందరగోళం

అయితే ఆ రెండు పార్టీలు ఆ పేరుతో రాజకీయాలు చేశాయే తప్ప ఈ ప్రాజెక్టు గురించి అవి కేంద్రంతో మాట్లాడానే లేదని, కేంద్రం నిబంధనల ప్రకారమే వ్యవహరించి తిప్పి పంపిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

“ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు మద్దతు కేంద్రానికి చాలా అవసరం కనుక ఆయన అడిగిన వెంటనే బనకచర్ల ప్రాజెక్టుకి కేంద్రం ఓకే చెప్పేస్తే మేము చూస్తూ ఊరుకోమంటూ” తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకునే ఉంటుంది. తెలంగాణ ప్రజలకు అటువంటి భావన కలిగించకూడదనే ఈవిదంగా చేసి ఉండవచ్చు.

Also Read – ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ పవన్‌ కళ్యాణ్‌

బహుశః అందుకే ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించడానికి తొందరపడకుండా మౌనంగానే ఉండిపోయినట్లు భావించవచ్చు. కానీ అంత మాత్రాన్న ఈ ప్రాజెక్టుని ఆటకెక్కించేయదు. దీనిపై ఏవిదంగా ముందుకు వెళ్ళాలో ఆలోచించుకుంటున్నట్లు భావించవచ్చు.

దీనిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పందించారు కానీ ఈ ప్రాజెక్టుని కేంద్రం తిరస్కరించడాన్ని ఆయన తప్పు పట్టలేదు. ఈ ప్రాజెక్ట్ రాకపోతే తన రాయలసీమకి నీళ్ళు అందక నష్టం కలుగుతుందని బాధపడలేదు! జగన్‌ మాత్రమే బనకచర్ల ప్రాజెక్టు నిర్మించగలరు. చంద్రబాబు నాయుడు వల్ల కాదన్నారు.

తెలంగాణలో దీని క్రెడిట్ కోసం కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీ కీచులాడుకుంటుంటే, ఏపీలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినందుకు వైసీపీ సంతోషిస్తున్నట్లుంది.